శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 19:54:47

గిఫ్ట్ వ‌చ్చిన ఆనందంలో కోతి ఎక్సైట్‌మెంట్ చూడాలి.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ చ‌దువుతూ ఓపెనింగ్‌!

గిఫ్ట్ వ‌చ్చిన ఆనందంలో కోతి ఎక్సైట్‌మెంట్ చూడాలి.. ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ చ‌దువుతూ ఓపెనింగ్‌!

సాధార‌ణంగా డెలివ‌రీ వ‌చ్చినా, ఎవ‌రైనా గిఫ్ట్ ఇచ్చినా.. అందులో ఏముందో చూడాల‌నే ఎక్సైట్‌మెంట్‌ను వ‌ర్ణించ‌లేం. ఆ గిఫ్ట్‌ చిన్న‌దైనా, పెద్ద‌దైనా. ఈ ఆత్రుత వ‌ట్టి మ‌నుషుల‌కే కాదు వ‌న్య‌ప్రాణుల‌కు కూడా ఉంటుంది. అందులో కోతిని ఊహించుకోండి. ఊహించుకోవ‌డం ఎందుకు రియ‌ల్‌గానే చూసేయండి. త‌న‌కు వ‌చ్చిన గిఫ్ట్‌ను ఓపెన్ చేస్తూ సంబ‌ర‌ప‌డిపోతున్న‌ది. బాక్స్‌ను ఓపెన్ చేస్తూనే మ‌ధ్య మ‌ధ్య‌లో ఇన్‌స్ట్ర‌క్ష‌న్స్ చ‌దువుతూ నెటిజ‌న్ల‌ను అబ్బుర‌ప‌రుస్తున్న‌ది.

పేప‌ర్‌లో ఇచ్చిన సూచ‌న‌ల మేర‌కు బాక్స్‌ను సీల్అవుట్ చేస్తున్న‌ది. ఈ వీడియోను అమెరిక‌న్ మాజీ బాస్కెట్‌బాల్ క్రీడాకారుడు రెక్స్ చాప్మ‌న్ ట్విట‌ర్‌లో షేర్ చేశారు. ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేపటికే ఈ వీడియో వైర‌ల్‌గా మారింది. 40 సెకండ్ల‌పాటు న‌డిచే ఈ వీడియోలో కోతి వాట‌ర్ బాటిల్‌ను అన్‌బాక్సింగ్ చేయ‌డాన్సి చూడొచ్చు. ఈ వీడియోను ఇప్ప‌టివ‌ర‌కు 1.1 మిలియ‌న్ల‌కు పైగా వీక్షించారు. ఇంకెందుకు ఆల‌స్యం మీరు కూడా ఓ లుక్ వేసేయండి. 

 


logo