గురువారం 04 జూన్ 2020
International - Apr 11, 2020 , 17:32:13

అమెరికా ఆంక్షలు కరోనా మహమ్మారి కన్నా ఘోరం

అమెరికా ఆంక్షలు కరోనా మహమ్మారి కన్నా ఘోరం

హైదరాబాద్: కమ్యూనిస్టు క్యూబా అమెరికా ఆర్థిక ఆంక్షలపై ధ్వజమెత్తింది. అవి కరోనా మహమ్మారి కన్నా ఘోరమైనవని పేర్కొన్నది. అమెరికా ఆంక్షల వల్ల వైద్యసరఫరాలకు విఘాతం కలుగుతున్నదని తెలిపింది. 1960ల ఆరంభంలో అప్పటి ప్రచ్ఛన్నయుద్ధ వాతావరణంలో అమెరికా ప్రకటించిన ఆంక్షలు నేటికీ కొనసాగుతున్నాయి. సాధారణమైన రోజులకన్నా ఇప్పుడు ఆంక్షలు మరింత క్రూరంగానూ, నరమేధ లక్షణాలను సంతరించుకున్నాయని క్యూబా ఆరోగ్య శాఖ అంతర్జాతీయ సంబంధాల డైరెక్టర్ నెస్టర్ మారిమన్ అన్నారు. ఆరోగ్య రంగంపై అవి వవేసే ప్రభావం వల్ల ప్రజల సంక్షేమం దెబ్బతింటున్నదని అన్నారు. ఐక్యరాజ్య సమితి 28 సంవత్సరాలు ఏకబిగిన ఈ ఆంక్షలను ఖండించింది. నిజానికి 1992లో ఔషధాల దిగుమతిపై ఆంక్షలు తొలగించినప్పటికీ వ్యాపారావకాశాలు సన్నగిల్లడం వల్ల ఆర్థిక సమస్యలు ఏర్పడుతున్నాయి.


logo