బుధవారం 20 జనవరి 2021
International - Jan 01, 2021 , 11:45:08

వుహాన్‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు.. కిక్కిరిసిన వీధులు

వుహాన్‌లో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు.. కిక్కిరిసిన వీధులు

వుహాన్‌‌:  గ‌త ఏడాది క‌రోనా వైర‌స్‌తో భ‌యాన‌కంగా వ‌ణికిపోయిన చైనాలోని వుహాన్ న‌గ‌రంలో న్యూ ఇయ‌ర్ వేడుక‌లు అంబ‌రాన్ని అంటాయి.  డిసెంబ‌ర్ 31వ తేదీన అర్థ‌రాత్రి వుహాన్ న‌గ‌రంలో భారీ సంఖ్య‌లో జ‌నం రోడ్ల‌మీద‌కు వ‌చ్చి సంబ‌రాలు చేసుకున్నారు.  2021కు వెల్క‌మ్ చెబుతూ సంద‌డి చేశారు. గ‌త ఏడాది జ‌న‌వ‌రిలో క‌రోనా మ‌హ‌మ్మారి వ‌ల్ల ఆ న‌గ‌రం అత‌లాకుత‌లమైంది.  ఏప్రిల్ వ‌ర‌కు సంపూర్ణ లాక్‌డౌన్‌లో ఉన్న వుహాన్‌.. గురువారం రాత్రి మాత్రం దిమ్మ‌తిరిగిపోయేలా స్థానికులు ఎంజాయ్ చేశారు. సాంప్ర‌దాయం ప్ర‌కారం హ‌న్‌కూవ్ క‌స్ట‌మ్స్ హౌజ్ బిల్డింగ్ వ‌ద్ద వంద‌ల సంఖ్య‌లో జ‌నం గుమ్మిగూడారు. ఆ ప్రాంతంలో ఉన్న ఓల్డ్ క్లాక్ 12 దాట‌డంతో.. గాలిలో బెలూన్లు నిండుపోయాయి. హ్యాపీ న్యూ ఇయ‌ర్ అంటూ అరుపులు, కేక‌లు మారుమోగాయి.  

భారీ సంఖ్య‌లో వ‌చ్చిన జ‌నాల‌ను పోలీసులు నియంత్రించారు. మాస్క్‌లు ధ‌రించ‌నివారికి సూచ‌న‌లు చేశారు.  స‌రిగ్గా 12 నెల‌ల క్రితం వుహాన్‌లో అత్య‌ధిక స్థాయిలో న్యూమోనియా కేసులు న‌మోదు అయ్యాయి. కోవిడ్‌19 వ్యాప్తి ఆ న‌గ‌ర‌మే కేంద్రంగా మారింది. అయితే వుహాన్ న‌గ‌రాన్ని ఈ జ‌న‌వ‌రిలోనే డ‌బ్ల్యూహెచ్‌వో నిపుణులు సంద‌ర్శించ‌నున్నారు. క‌రోనా మ‌హమ్మారి ఇక్క‌డే పుట్టింద‌న్న ఆరోప‌ణ‌ల‌పై వారు స్ట‌డీ చేయ‌నున్నారు.  చాన్నాళ్ల నుంచి వుహాన్‌లో వైర‌స్ కేసులు లేకున్నా.. ఇటీవ‌ల అక్క‌డ భారీ స్థాయిలో వ్యాక్సినేష‌న్ ప్ర‌క్రియ మొద‌లైంది. వుహాన్‌లో ఇప్పుడిప్పుడే సాధార‌ణ ప‌రిస్థితులు నెల‌కొంటున్నా.. ఇంకా అక్క‌డ అనేక వ్యాపార కేంద్రాలు ప‌నులు ప్రారంభించ‌లేద‌ని స్థానికులు చెబుతున్నారు.


logo