గురువారం 09 జూలై 2020
International - May 25, 2020 , 16:16:01

ముళ్లపందిని రోడ్డు దాటిస్తున్న కాకి : వీడియో వైరల్‌

ముళ్లపందిని రోడ్డు దాటిస్తున్న కాకి : వీడియో వైరల్‌

ప్రేమ, స్నేహం అనేది మనుషులకే కాదు ప్రాణం ఉన్న ప్రతీ జీవికి ఉంటుంది. అయితే సందర్భాన్ని బట్టి వాటి ప్రేమను బయటపెడతాయి వన్యప్రాణులు. ఇప్పుడా సందర్భం రానే వచ్చింది. రోడ్డు దాటలేని పరిస్థితిలో మినీ ముళ్లపంది ఉంది. రోడ్డు దాటలేక మధ్యలోనే ఆగిపోయింది. అసలే వాహనాలు ఎక్కువగా తిరిగే ప్రదేశం. డ్రైవర్లు ఏ మాత్రం నిర్లక్ష్యం వహించినా ముళ్లపంది చనిపోయే అవకాశం ఉంది. ఇది గమనించి ఒక కాకి అక్కడికి వచ్చి ముక్కుతో వెనుకవైపు పొడవడం మొదలుపెట్టింది. దీంతో ఆ జీవి కొంచెం ముందుకు కదలసాగింది. కొంతదూరం వెళ్లి ఆగిపోవడంతో మరలా ముక్కుతో కదిలిస్తే కదులుతుంది. ఇలా ముళ్లపందిని చివరి వరకు రోడ్డు క్రాస్‌ చేపిస్తున్న వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్‌ చేస్తున్నది. దీనిని ఓ యూజర్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. షేర్‌  చేసిన కాసేపటికే మిలియన్ల వ్యూస్‌ సొంతం చేసుకున్నది. కొంతమంది అయితే వన్యప్రాణుల నుంచి చాలా నేర్చుకోవాలి అంటుంటే.. నేను హెడ్జ్‌హాగ్‌.. కాకి నా అలారమ్‌ అంటూ కామెంట్లు పెడుతున్నారు.


logo