శనివారం 28 మార్చి 2020
International - Mar 24, 2020 , 12:32:27

క్రొయేషియాను కుదిపేస్తున్న భూకంపాలు!

క్రొయేషియాను కుదిపేస్తున్న భూకంపాలు!

జగ్రేబ్‌: కరోనా వైరస్‌తో ఇబ్బంది పడుతున్న యూరప్‌ దేశం క్రొయేషియాకు వరుసగా సంభవిస్తున్న భూకంపాలు కొత్త చిక్కులు తెచ్చి పెడుతున్నాయి. రాజధాని జాగ్రెబ్‌లో ఆదివారం సంభవించిన భారీ భూకంపానికి నగరంలోని చారిత్రాత్మక భవంతులు, బిల్డింగులు, ఇండ్లు నేలమట్టమయ్యాయి. భయంతో ప్రజలు దవాఖానల నుంచి బయటకు పరుగులు తీశారు. రిక్టర్‌ స్కేల్‌పై 5.5 తీవ్రతతో నమోదైన ఈ భూకంపం కారణంగా 27 మంది గాయపడ్డారని, వందల సంఖ్యలో ఇండ్లు నేలమట్టమయ్యాయని అంతర్గత వ్యవహారాల మంత్రి దావోర్‌ బోజినోవిక్‌ తెలిపారు. సోమవారం కూడా క్రొయేషియాలోని పలు నగరాల్లో భూప్రకంపనలు నమోదయ్యాయి. దేశంలో కరోనా తీవ్రత పెరుగుతున్న క్రమంలో ప్రజలు గుమిగూడవద్దని ప్రభుత్వం ఆంక్షలు విధించింది. అయితే, సోమవారం పలు నగరాల్లో భూప్రకంపనలు నమోదవ్వడంతో భయంతో ఇండ్లనుంచి బయటకు వచ్చిన ప్రజలు పబ్లిక్‌ పార్కుల్లో గుమిగూడారు. ‘ఏకకాలంలో మేము రెండు విపత్తులతో పోరాడుతున్నాం’ అని బోజినోవి ఈ సందర్భంగా పేర్కొన్నారు.  


logo