ఆదివారం 24 జనవరి 2021
International - Jan 08, 2021 , 15:15:39

టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న దేశాధ్య‌క్షుడు, క్యాబినెట్‌

టీవీ లైవ్‌లో టీకా తీసుకున్న దేశాధ్య‌క్షుడు, క్యాబినెట్‌

జ‌గ్రేబ్‌:  క్రొయేషియా అధ్యక్షుడు జోర‌న్ మిలానోవిక్‌తో పాటు ఆయ‌న క్యాబినెట్ కూడా క‌రోనా వైర‌స్ వ్యాక్సిన్‌ను ప‌బ్లిక్‌గా తీసుకున్నారు. టీవీ కెమెరాల ముందు లైవ్‌లో నేత‌లంతా టీకాలు వేయించుకున్నారు.  ప్ర‌జ‌ల్లో వ్యాక్సిన్ ప‌ట్ల అభ‌ద్ర‌త నెల‌కొన్న నేప‌థ్యంలో.. అధ్య‌క్షుడు జోర‌న్‌తో పాటు క్యాబినెట్ అంతా లైవ్‌లో వ్యాక్సిన్ తీసుకున్నారు. ఓ మెడిక‌ల్ వ‌ర్క‌ర్ గుర‌వారం రోజున అధ్య‌క్ష భ‌వ‌నంలో జోర‌న్‌కు టీకా ఇచ్చారు.  డిసెంబ‌ర్ 27వ తేదీ నుంచి ఫైజ‌ర్ టీకాను క్రొయేషియాలో పంపిణీ చేస్తున్నారు.  42 ల‌క్ష‌ల జ‌నాభాలో ఇప్ప‌టికే 20 వేల మందికి టీకా ఇచ్చారు.  తొలి ద‌ఫాలో రిటైర్మెంట్ హోమ్ రెసిడెంట్స్‌, హెల్త్‌కేర్ వ‌ర్క‌ర్లు, రోగులు, దీర్ఘ‌కాలిక వ్యాధులు ఉన్న‌వారి వ్యాక్సిన్ ఇస్తున్నారు.  ప్ర‌తి ఒక్క‌రూ వ్యాక్సిన్ తీసుకోవాల‌ని, ఇది అంద‌రికీ ఉప‌యోగ‌ప‌డుతుంద‌ని అధ్య‌క్షుడు జోర‌న్ మిలానోవిక్ తెలిపారు. 

ఇవి కూడా చ‌ద‌వండి

గ‌వ‌ర్న‌మెంట్ జాబ్ ఇప్పిస్తాన‌ని 8 కోట్ల మోసం

సిడ్నీ టెస్ట్‌లో రోహిత్ శ‌ర్మ అరుదైన రికార్డు

రోహిత్‌, గిల్‌ల‌ను రెచ్చ‌గొట్టిన ల‌బుషేన్‌‌.. వీడియో

క్యాపిట‌ల్ హిల్ అటాక్‌.. సూప‌ర్ స్ప్రెడింగ్ ఈవెంట్ !

త‌న‌కు తాను క్ష‌మాభిక్ష .. ట్రంప్ మ‌రో సంచ‌ల‌నం!

ప్రెగ్నెన్సీ కోసం ల‌‌ఢాక్‌కు యురోపియ‌న్ అమ్మాయిలు.. ఎందుకు?

హెచ్‌-1బీ వీసా: లాట‌రీ ప‌ద్ధ‌తికి గుడ్‌బై


logo