క్రొయేషియాలో భూకంపం.. ఏడుగురు మృతి

జాగ్రెబ్ (క్రొయేషియా) : సెంట్రల్ క్రొయేషియాలో మంగళవారం 6.4 రిక్టర్ స్కేలుపై తీవ్రతతో భూకంపం సంభవించింది. దీంతో పెద్ద ఎత్తున భవనాలు ధ్వంసమయ్యాయి. భూకంపంతో కనీసం ఏడుగురు మరణించగా.. డజన్ల కొద్దీ గాయపడ్డారని యూఎస్ జియోలాజికల్ సర్వే, క్రొయేషియన్ అధికారులు తెలిపారు. అలాగేపెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగింది. మిలిటరీ సహాయంతో అత్యవసర సిబ్బంది సహాయక చర్యలు చేపడుతున్నారు. విద్యుత్ సరఫరా నిలిచిపోవడంతో ఇబ్బందులు ఎదురయ్యాయి. క్రొయేషియా రాజధాని జాగ్రెబ్‌కు ఆగ్నేయంగా 30 మైళ్ల దూరంలో స్థానిక సమయం మధ్యాహ్నం తర్వాత ప్రకంపనలు వచ్చాయి. ఈ ఏడాది క్రొయేషియాలో సంభవించిన అతిపెద్ద భూకంపం ఇదేనని యూరోపియన్-మెడిటరేనియన్ సీస్మోలాజికల్ సెంటర్ తెలిపింది. ఇదిలా ఉండగా.. మృతుల సంఖ్య పెరిగే అవకాశం ఉందని ఆ దేశ ప్రధానమంత్రి ఆండ్రేజ్ ప్లెన్కోవిక్ అన్నారు. పెట్రింజా పట్టణానికి వెళ్లొద్దని పౌరులకు విజ్ఞప్తి చేశారు. పెట్రింజా పట్టణంలో ఓ చిన్నారితో పాటు.. షినా గ్రామంలో చర్చిలో ఓ వ్యక్తి, మజ్స్కే పోల్జనే గ్రామంలో ఐదుగురు వ్యక్తులు చనిపోయారని క్రొయేషియా అంతర్గత వ్యవహారాల శాఖ తెలిపింది.
తాజావార్తలు
- హస్తిన సరిహద్దుల్లో అదనపు బలగాలు!
- హర్యానా, పంజాబ్‌ల్లో హైఅలర్ట్
- వ్యాక్సిన్ కోసం కెనడా సంస్థ సీఈవో కొలువు ఖల్లాస్
- ఉరేసుకోబోతున్న వ్యక్తిని కాపాడిన పోలీసులు
- సీఎం కేసీఆర్ నిర్ణయం చారిత్రాత్మకం
- ట్రాక్టర్ ర్యాలీ హింసాత్మకం..83 మంది పోలీసులకు గాయాలు
- కాంగ్రెస్‌ను వీడి టీఆర్ఎస్లో చేరిక
- మహవీర్ చక్రతో వందశాతం సంతృప్తి చెందట్లేదు: సంతోష్ తండ్రి
- అంతర్ జిల్లా దొంగల ముఠా అరెస్ట్
- నూతన సచివాలయం, అమరవీరుల స్మారకంపై మంత్రి వేముల సమీక్ష