సోమవారం 25 జనవరి 2021
International - Dec 21, 2020 , 19:12:21

మ‌నీ లాండ‌రింగ్ కేరాఫ్ లండ‌న్ ల‌గ్జ‌రీ ఇళ్లు

మ‌నీ లాండ‌రింగ్ కేరాఫ్ లండ‌న్ ల‌గ్జ‌రీ ఇళ్లు

లండ‌న్‌: మ‌నీ లాండ‌రింగ్‌కు కేరాఫ్‌గా మారాయి లండ‌న్‌లోని ల‌గ్జ‌రీ ఇళ్లు. అక్క‌డి రియ‌ల్ ఎస్టేట్ వ్యాపారం మొత్తం దేశ‌విదేశాల్లోని అక్ర‌మ సంపాద‌నతో నిండిపోతోంది. తాజాగా ఈ రిస్క్ మ‌రింత పెరిగిన‌ట్లు యూకే ప్ర‌భుత్వం త‌న డిసెంబ‌ర్ నివేదిక‌లో వెల్లడించింది. మూడేళ్ల కింద‌ట మీడియంగా ఉన్న రిస్క్‌ను ఈ మ‌ధ్యే హై రిస్క్‌గా అక్క‌డి ప్ర‌భుత్వం మార్చింది. రియ‌ల్ ఎస్టేట్ ఏజెన్సీ సెక్టార్‌కు కూడా రిస్క్‌ను మీడియానికి మార్చింది. లండ‌న్‌, ఎడిన్‌బ‌ర్గ్ లేదా యూనివ‌ర్సిటీ టౌన్ల‌లో అత్య‌ధిక విలువ ఉన్న ఆస్తుల‌పై క్రిమినల్స్ క‌న్నేసే అవ‌కాశం ఉంది. ముఖ్యంగా విదేశీ సంస్థ‌ల‌కు లండ‌న్ అడ్డాగా మార‌నుంది అని ప్ర‌భుత్వ నివేదిక వెల్ల‌డించింది. 

కొవిడ్‌-19 ఈ రంగాన్ని మ‌రింత ప్ర‌మాదంలోకి నెట్టింది. క‌రోనా వ‌ల్ల ఈ ల‌గ్జ‌రీ ఇళ్ల‌కు డిమాండ్ త‌గ్గి డిస్కౌంట్లు ప్ర‌క‌టించాల్సిన ప‌రిస్థితి త‌లెత్తుతోంది. దీంతో ఈ రంగంలో డ‌ర్టీ మ‌నీ మ‌రింత పెరిగే ప్ర‌మాదం ఉన్న‌ద‌ని ప్ర‌భుత్వ నివేదిక తెలిపింది. అంతేకాకుండా కొవిడ్ వ‌ల్ల దివాళా తీసిన వ్యాపారాల‌ను కూడా నేర‌గాళ్లు ల‌క్ష్యంగా చేసుకునే ప్ర‌మాదం ఉన్న‌ట్లు చెప్పింది. యూకేలో ఇప్ప‌టి వ‌ర‌కు ఇలా అక్ర‌మ సంపాద‌న‌తో కొనుగోలు చేసిన ఆస్తులు 500 వ‌ర‌కూ గుర్తించిన‌ట్లు ట్రాన్స్‌ప‌రెన్సీ ఇంట‌ర్నేష‌న‌ల్ అనే ఎన్జీవో వెల్ల‌డించింది. ఈ మొత్తం విలువ 660 కోట్ల డాల‌ర్లుగా అంచ‌నా వేసింది. నిజానికి అస‌లు యూకే రియ‌ల్ ఎస్టేట్‌లో దాగి ఉన్న డ‌ర్టీ మ‌నీలో ఈ మొత్తం చాలా చిన్న‌ది కావ‌చ్చ‌ని కూడా ఆ సంస్థ అనుమానం వ్య‌క్తం చేసింది. 


logo