బుధవారం 03 జూన్ 2020
International - Apr 14, 2020 , 12:52:49

పేదదేశాల రుణాల చెల్లింపు వాయిదాకు దాతలు సుముఖం

పేదదేశాల రుణాల చెల్లింపు వాయిదాకు దాతలు సుముఖం

హైదరాబాద్: కరోనా నివారణపై సంపూర్ణంగా దృష్టి కేంద్రీకరించేందుకు వీలుగా ప్రపంచంలోని నిరుపేద దేశాల రుణ బకాయీల చెల్లింపులను వాయిదా వేసేందుకు రుణదాతలు సుముఖంగానే ఉన్నట్టు కనిపిస్తున్నదని ప్రపంచ బ్యాంకు మేనేజింగ్ డైరెక్టర్ ఆక్సెల్ ఫాన్ ట్రాట్సెన్‌బర్గ్ వెల్లడించారు. ఆఫ్ఘనిస్తాన్, మాలి, హైతీ, యెమెన్ తదితర 25 పేద దేశాల రుణాల చెల్లింపులను తాత్కాలికంగా వాయిదావేయాలని ప్రపంచ బ్యాంకు, అంతర్జాతీయ ద్రవ్యనిధి సంస్థ చేసిన ప్రతిపాదనకు 20 ప్రధాన ఆర్థిక వ్యవస్థలు, జీ-7 దేశాలు స్థూలంగా అనుకూలత వ్యక్తం చేశాయని చెప్పారు. బారీ రుణదాతల్లో చైనాతో పాటుగా పలు అభివృద్ధి చెందిన దేశాలున్నాయి. పేద దేశాలకు సాయం అందించాల్సిన ఆవశ్యకత గురించి వాటిలో ప్రతిఒక్క దేశమూ గుర్తిస్తున్నదని, రుణాల వాయిదాపై భారీస్థాయిలో మద్దతు వ్యక్తమవుతున్నదని తెలిపారు. ఎవరూ దీనిని కాదనడం లేదని, అస్సలు ఎవరూ ప్రశ్నించడం లేదని ప్రపంచబ్యాంకు ఎండీ వివరించారు. ముందుకు కదిలేందుకు మంచి వాతావరణం ఉన్నదని అన్నారు. 


logo