శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 08, 2020 , 13:46:44

కూజాలో ఇరుక్కున్న తోడేలు త‌ల‌.. ఎంతో వైనంగా బ‌య‌ట‌కు తీసిన మ‌హిళ‌!

కూజాలో ఇరుక్కున్న తోడేలు త‌ల‌.. ఎంతో వైనంగా బ‌య‌ట‌కు తీసిన మ‌హిళ‌!

అడ‌విలో తిరిగే తోడుల‌కు ఒక కూజాలో ఏం క‌నిపించిందో ఏమో.. తిన‌డానికి త‌ల లోప‌ల పెట్టింది. పాపం త‌ల‌ని బ‌య‌ట‌కు తీద్దామ‌నుకునేస‌రికి ఇరుక్కుపోయింది. ఎంత ప్ర‌య‌త్నించినా లాభం లేక‌పోయింది. అరిచినా వినే నాదుడే లేడు. అప్పుడే ఆ దేవుడే పంపించాడో ఏమో ఒక మ‌హిళ రూపంలో తోడేలును ప్రాణాల‌తో కాపాడేలా చేశాడు. ఇప్పుడు ఈ వీడియో సోష‌ల్ మీడియాలో వైరల్‌గా మారింది.

ఇటీవ‌ల కెన‌డాలోని నార్త్ వాంకోవ‌ర్‌లోని క‌న్జ‌ర్వేష‌న్ ఆఫీస‌ర్ స‌ర్వీస్ ఫేస్‌బుక్‌లో షేర్ చేశారు. మాపుల్‌రిడ్జ్‌లోని క‌న్జ‌ర్వేష‌న్ ఆఫీస‌ర్ క్రీమ్ సాయంతో నెమ్మ‌దిగా తోడేలు త‌ల‌ను కూజా నుంచి విడిపించారు. ఇది నెటిజ‌న్ల‌ను ఎంతో ఉత్సాహ‌ప‌రుస్తుంది. ఇది ఆన్‌లైన్‌లోకి వ‌చ్చిన కాసేప‌టికే వైర‌ల్‌గా మారింది. ఇప్ప‌టివ‌ర‌కు దీనిని 22 కే మంది కంటె ఎక్కువ‌మంది వీక్షించారు.  


logo