శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Jul 25, 2020 , 16:49:50

యువ‌త‌ కోలువాలంటే 3 వారాలు ప‌డుతుంది : అమెరికా స్ట‌డీ

యువ‌త‌ కోలువాలంటే 3 వారాలు ప‌డుతుంది : అమెరికా స్ట‌డీ

హైద‌రాబాద్‌: క‌రోనా వైర‌స్ నుంచి పూర్తిగా కోలుకునేందుకు క‌నీసం మూడు వారాలు ప‌డుతుంద‌ని అమెరికా ప‌రిశోధ‌కులు చెప్పారు.  స్వ‌ల్ప స్థాయిలో ల‌క్ష‌ణాలు ఉన్నా.. అవి యువ‌కులు, మ‌ధ్య‌వ‌య‌స్కుల్లోనూ ప్ర‌భావం చూప‌నున్నాయి. 18 నుంచి 34 ఏళ్ల వ‌య‌సులో ఉన్న‌వారికి ఎటువంటి ఆరోగ్య సమ‌స్య‌లు లేకున్నా.. వారిలో కోవిడ్ ల‌క్ష‌ణాలు రెండు నుంచి మూడు వారాల పాటు ఉంటున్న‌ట్లు ప‌రిశోధ‌కులు చెప్పారు.  ద‌గ్గు, అల‌స‌ట‌, వ‌ళ్లు నొప్పులు.. సాధార‌ణ ల‌క్ష‌ణాలుగా ఉంటాయ‌న్నారు. అమెరికాలోని సెంట‌ర్స్ ఫ‌ర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్ష‌న్ (సీడీసీ) ప‌రిశోధ‌కులు ఈ అధ్య‌య‌నం చేశారు.  మార్చి నుంచి జూన్ 4వ తేదీ మ‌ధ్య వైర‌స్ సోకిన‌ 274 మంది రోగుల‌కు ఫోన్ స‌ర్వే చేప‌ట్టారు. ప‌రీక్ష‌లు నిర్వహించిన త‌ర్వాత రెండు నుంచి మూడు వారాల పాటు వారిని ప్ర‌శ్నించారు. 

మ‌ధ్య‌వ‌య‌సు ఉన్నవారిలో మూడ‌వ వంతు వైర‌స్ నుంచి కోలుకోలేదు. 50 లేదా అంత‌క‌న్నా ఎక్కువ వ‌య‌సు ఉన్న‌వారిలో స‌గం మంది కోలుకోలేద‌ని ప‌రిశోధ‌కులు చెప్పారు. దీర్ఘ‌కాలిక అనారోగ్యం ఉన్న‌వారు, ముఖ్యంగా ఊభ‌కాయం ఉన్న వారిలో వైర‌స్ ఎక్కువ‌గా ఉన్న‌ట్లు గుర్తించారు. ఫ్లూ లేదా వైర‌ల్ ఇన్ఫెక్ష‌న్లు ఉన్నవారిలో ఎక్కువ శాతం మంది రోగులు కేవ‌లం రెండు వారాల్లోనే కోలుకున్న‌ట్లు వండ‌ర్‌బిల్ట్ యూనివ‌ర్సిటీ డాక్ట‌ర్ వెస్లే సెల్ఫ్ తెలిపారు. సీడీసీతో అనుబంధం క‌లిగి ఉన్న 14 మెడిక‌ల్ సెంట‌ర్ల‌లో ఆ డాక్ట‌ర్ స‌ర్వే ప‌నిచేప‌ట్టారు. 

అమెరికాలో పెరుగుతున్న ఇన్ఫెక్ష‌న్ల‌కు యువ‌కులే కార‌ణ‌మ‌ని తేల్చారు.  బార్లు, ఇత‌ర ప్ర‌దేశాల్లో గుమ్మికూడుతున్న‌వారి వ‌ల్ల వైర‌స్ ప్ర‌బ‌లుతున్న‌ట్లు గుర్తించారు. అందుకే సోష‌ల్ డిస్టాన్సిన్‌ను క‌చ్చితంగా పాటించాల‌ని డాక్ట‌ర్ వెస్లే సెల్ఫ్ తెలిపారు. అమెరికాలో నివ‌సిస్తున్న న‌ల్ల‌జాతీయులు, హిస్పానిక్‌ల‌పై కోవిడ్ ప్ర‌భావం భిన్నంగా ఉన్న‌ట్లు కూడా గుర్తించారు. logo