శుక్రవారం 05 జూన్ 2020
International - May 09, 2020 , 16:51:06

దక్షిణ కొరియాలో కరోనా సెకండ్‌ వేవ్‌

దక్షిణ కొరియాలో కరోనా సెకండ్‌ వేవ్‌

సియోల్‌: దక్షిణ కొరియాలో కరోనా వైరస్‌ వ్యాప్తి రెండో సారి మొదలైనట్లుగా కనిపిస్తున్నది. గత కొన్నిరోజులుగా కేసులు నమోదు కాకపోవడం, మరణాలు లేకపోవడంతో బార్లు, క్లబ్బులకు అక్కడి ప్రభుత్వం అనుమతినిచ్చింది. అయితే కరోనా వైరస్‌ రెండోసారి తన ప్రతాపాన్ని చూపడంతో ప్రజలు భయబ్రాంతులకు గురవుతున్నారు. నైట్‌క్లబ్‌లకు వెళ్లినవారిలో కొవిడ్‌-19 కు గురైనవారి సంఖ్య శనివారానికి 40 కి చేరుకొన్నది. ఈ సంఖ్య మరింత ఎక్కువ కాకుండా ఉండేందుకు సియోల్‌ సిటీ మేయర్‌ పార్క్‌ వన్‌ సూన్‌ కట్టుదిట్టమైన చర్యలు చేపట్టారు. నైట్‌క్లబ్బులు, డిస్కోలు, బార్లను తక్షణమే మూసేయాలని పార్క్‌ ఆదేశాలు జారీచేశారు. చైనా తర్వాత దక్షిణ కొరియాలో ఎక్కువ సంఖ్యలో జనం కరోనా వైరస్‌కు గురయ్యారు. వైరస్‌ మరింత వ్యాప్తి చెందకుండా  ఉండేందుకు అందుబాటులో ఉన్న అన్ని వనరులను సమీకరిస్తామని దక్షిణ కొరియా ప్రధానమంత్రి చుంగ్‌ సై క్యూన్‌ ప్రతిజ్ఞచేశారు. కాగా, భౌతిక దూరాన్ని పాటించేలా ప్రచారం చేయడం మొదలెట్టారు. ఈ వారం నుంచి మొదలుకావాల్సిన పాఠశాలలను 13 నుంచి ప్రారంభించాలని నిర్ణయం తీసుకొన్నట్లు ప్రకటించారు.


logo