మంగళవారం 01 డిసెంబర్ 2020
International - Nov 19, 2020 , 14:13:04

అధికార బదాలయింపు జాప్యంతో టీకా ప్రణాళిక వెనక్కి! : బైడెన్‌

అధికార బదాలయింపు జాప్యంతో టీకా ప్రణాళిక వెనక్కి! : బైడెన్‌

వాషింగ్టన్‌ : అధికార బదలాయింపులో జాప్యంతో కొవిడ్‌-19 టీకా ప్రణాళిక వారాలు లేదంటే నెలలు వెనక్కి వెళ్తోందని అమెరికా ఎలెక్టెడ్‌ ప్రెసిడెంట్‌ జో బిడెన్‌ హెచ్చరించారు. హెల్త్‌కేర్‌ కార్మికులతో వర్చువల్‌ రౌండ్‌టేబుల్‌లో బుధవారం మాట్లాడారు. ట్రంప్‌ పరిపాలన బృందం నుంచి తమకుఎలాంటి సహకారం అందడం లేదని ఆరోపించారు. అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో బైడెన్‌ ఎన్నికను ట్రంప్‌ అంగీకరించడం లేదు. అనేక రాష్ట్రాల్లో పోల్‌ ఫలితాలను సవాల్‌ చేస్తూ వ్యాజ్యాలు దాఖలు చేసిన విషయం తెలిసిందే. ‘తాము ఇప్పుడు ఎదుర్కొంటున్న సమస్యల్లో ఒకటి అడ్మినిస్ట్రేషన్‌ను గుర్తించడంలో వైఫల్యం. జనరల్‌ సర్వీసెస్‌ అడ్మినిస్ట్రేషన్‌ ఎవరు విజేత ఎవరో చట్టం చెబుతుందని, అప్పుడు ప్రభుత్వం సిద్ధంగా ఉండాలి’ అని బైడెన్‌ అన్నారు. తమకు ఇంకా సమాచారం తెలియదని, కరోనా వ్యాక్సిన్‌ ఎప్పుడు పంపిణీకి సిద్ధమవుతాయో?, ఎవరికి మొదట ఇవ్వాలి.. ప్రణాళిక ఏంటీ అనేదిపై అవగాహనకు వస్తామన్నారు. 


లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.