మంగళవారం 26 మే 2020
International - Apr 24, 2020 , 12:41:00

యూకేలో పెరుగుతున్న కోవిడ్ మ‌ర‌ణాలు

 యూకేలో పెరుగుతున్న కోవిడ్ మ‌ర‌ణాలు

లండ‌న్‌: బ్రిట‌న్‌లో క‌రోనా మ‌హ‌మ్మారిస్ కరాళ నృత్యం చేస్తోంది. ఆ దేశంలో అంతకంతకూ కొత్త కేసుల‌తో పాటు.. మ‌ర‌ణాలు కూడా భారీగా సంభ‌విస్తున్నాయి. కోవిడ్-19 కారణంగా గడిచిన  24 గంటల్లో 616 మంది మృత్యువాత ప‌డ్డారు. దాంతో మొత్తం మరణాల సంఖ్య 18,738 కు చేరింది. ఇప్ప‌టివ‌ర‌కు అక్క‌డ‌ మొత్తం క‌రోనా కేసుల సంఖ్య 1,38,078కి చేరుకుంది. ముఖ్యంగా ఇంగ్లాండ్, వేల్స్ , స్కాట్లాండ్ , ఉత్తర ఐర్లాండ్ లో ఎక్కువగా మరణాలు సంభవించాయి. ఇక‌ అక్క‌డి ప్ర‌భుత్వం క‌రోనా క‌ట్ట‌డి చేసేందుకు అనేక చ‌ర్య‌లు చేప‌డుతుంది. అటు కరోనావైరస్ కోసం పరీక్షలను మ‌రింత వేగంగా చేయడానికి అనేక ప్రాంతాల్లో ల్యాబ్ లను పెంచింది. 


logo