బుధవారం 03 జూన్ 2020
International - Apr 03, 2020 , 15:57:51

స్పెయిన్‌లో మ‌ళ్లీ పెరిగిన మృతుల సంఖ్య‌

 స్పెయిన్‌లో మ‌ళ్లీ పెరిగిన మృతుల సంఖ్య‌

హైద‌రాబాద్‌:  స్పెయిన్‌లో మ‌ళ్లీ మృతుల సంఖ్య పెరిగింది.  క‌రోనా వైర‌స్ వ‌ల్ల ఆ దేశంలో గ‌త 24 గంట‌ల్లో 932 మంది చ‌నిపోయారు.  దీంతో మృతుల సంఖ్య 10,935కు చేరుకున్న‌ది.  ఇట‌లీ త‌ర్వాత ప్ర‌పంచంలో అత్య‌ధిక మ‌ర‌ణాల సంభ‌వించిన దేశంగా స్పెయిన్ నిలిచింది.  శుక్ర‌వారం నాడు ఆ దేశంలో పాజిటివ్ తేలిన కేసుల సంఖ్య ల‌క్షా 17 వేలు దాటింది. లాంబార్డీ లాంటి ప్రాంతాల్లో ఉన్న హాస్ప‌ట‌ళ్లు తీవ్ర వ‌త్తిడికి లోన‌వుతున్నాయి. ఇంటెన్సివ్ కేర్ యూనిట్లు ఇప్ప‌టికే పేషెంట్ల‌తో నిండిపోయాయి. తాజా ఆ ప్రాంతంలో 1300 కొత్త కేసులు న‌మోదు అయ్యాయి.  దేశ‌వ్యాప్తంగా సుమారు ప‌ది వేల మంది వైద్య సిబ్బంది ఇన్‌ఫెక్ష‌న్‌కు గుర‌య్యారు.   


logo