బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 04, 2020 , 22:40:06

గుడ్‌న్యూస్‌: మూడునెలల్లోపే అందుబాటులోకి ఆక్స్‌ఫర్డ్‌ టీకా

గుడ్‌న్యూస్‌: మూడునెలల్లోపే అందుబాటులోకి ఆక్స్‌ఫర్డ్‌ టీకా

లండన్‌: కరోనా మహమ్మారి వల్ల ఎన్నో ప్రాణాలు గాల్లో కలిసిపోయాయి. ఇంకా విజృంభణ కొనసాగుతూనే ఉంది. ఇప్పటిదాకా వ్యాక్సిన్‌ అందుబాటులోకి రాలేదు. కొన్ని టీకాలు చివరిదశ క్లినికల్‌ ట్రయల్స్‌లో ఉన్నాయి. ఈ తరుణంలో బ్రిటన్‌లోని ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ శుభవార్త అందించింది. మూడు నెలల్లోగా తమ వ్యాక్సిన్‌ ప్రజలకు అందుబాటులోకి వస్తుందని ప్రకటించింది. 2021 ప్రారంభానికి ముందే దీనిని ఆమోదిస్తున్నారని ఆక్స్‌ఫర్డ్‌ శాస్త్రవేత్తలు వెల్లడించారు. 

ఈ వ్యాక్సిన్‌ అందుబాటులోకి వస్తే పిల్లలను మినహాయించి పెద్దలందరికీ రోగనిరోధకత కార్యక్రమం ఊహించినదానికంటే ముందే ప్రారంభం కానుంది. ఆరు నెలల్లోపు ప్రతి పెద్దవారికి వ్యాక్సిన్‌ డోస్‌ అందుతుందని ఆరోగ్య అధికారులు అంచనావేస్తున్నారు. కాగా,  ఆస్ట్రాజెనెకా, ఆక్స్‌ఫర్డ్‌ వర్సిటీ తయారుచేసిన ఈ టీకాపై డేటా సమీక్షను యూరోపియన్‌ మెడిసిన్స్‌ ఏజెన్సీ ప్రారంభించింది. ఈ ప్రాంతంలో వ్యాక్సిన్‌ను ఆమోద ప్రక్రియను వేగవంతం చేయడమే దీని లక్ష్యమని ఏజెన్సీ ఇటీవల వెల్లడించింది.  

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో.


logo