సోమవారం 23 నవంబర్ 2020
International - Nov 16, 2020 , 14:40:34

కోవిడ్ టీకా త‌యారీ కంపెనీల‌పై హ్యాక‌ర్ల దాడి: మైక్రోసాఫ్ట్‌

కోవిడ్ టీకా త‌యారీ కంపెనీల‌పై హ్యాక‌ర్ల దాడి:  మైక్రోసాఫ్ట్‌

హైద‌రాబాద్‌:  కోవిడ్‌19 టీకా అభివృద్ధి చేస్తున్న ఫార్మా కంపెనీల‌పై ర‌ష్యా, నార్త్ కొరియా హ్యాక‌ర్లు దాడి చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ పేర్కొన్న‌ది. కెన‌డా, ఫ్రాన్స్‌, ఇండియా, ద‌క్షిణ కొరియా, అమెరికా దేశాల్లో ఏడు ప్ర‌ఖ్యాత ఫార్మా సంస్థ‌లు వ్యాక్సిన్ అభివృద్ధి చేస్తున్నాయ‌ని, అయితే ఆ కంపెనీల‌పై సైబ‌ర్ హ్యాక‌ర్లు దాడి చేస్తున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది. చాలా వ‌ర‌కు ఫార్మా కంపెనీలు వివిధ ద‌శ‌ల్లో క్లినిక‌ల్ ట్ర‌య‌ల్స్ నిర్వ‌హిస్తున్నాయి. సైబర్ దాడుల‌ను కొంత వ‌ర‌కు నియంత్రించిన‌ట్లు మైక్రోసాఫ్ట్ చెప్పింది. అయితే టార్గెట్ చేసిన సంస్థ‌ల‌కు ఈ విష‌యాన్ని చేర‌వేసిన‌ట్లు మైక్రోసాఫ్ట్ వెల్ల‌డించింది. మూడు హ్యాక‌ర్ గ్రూపులు ఈ దాడుల‌కు పాల్ప‌డుతున్నాయ‌ని, వాటిలో ర‌ష్యాకు చెందిన స్ట్రోన్‌టియ‌మ్‌, నార్త్ కొరియాకు చెందిన జింక్‌, సీరియ‌మ్ హ్యాక‌ర్లు సైబ‌ర్ దాడుల‌కు పాల్ప‌డుతున్న‌ట్లు మైక్రోసాఫ్ట్ ఆరోపించింది.  కోవిడ్ డేటాను త‌స్క‌రించేందుకు స్ట్రోన్‌టియ‌మ్ సంస్థ పాస్‌వ‌ర్డ్ స్ప్రే, బ్రూట్ ఫోర్స్ లాగిన్ ప‌ద్ధతుల్లో సైబ‌ర్ దాడులు చేస్తున్న‌ట్లు గురించారు. ఇక జింక్‌, సీరియ‌మ్ హ్యాక‌ర్లు.. స్పియ‌ర్ ఫిషింగ్ ప‌ద్ద‌తుల్లో యూజ‌ర్ల‌కు వ‌ల వేసి విశ్వ‌స‌నీయ స‌మాచారాన్ని చోరీ చేస్తున్నార‌ని మైక్రోసాఫ్ట్ ఆరోపించింది.