బుధవారం 20 జనవరి 2021
International - Dec 18, 2020 , 23:20:14

2021 ప్రారంభంలోనే పేద దేశాలకు వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్‌వో

2021 ప్రారంభంలోనే పేద దేశాలకు వ్యాక్సిన్‌: డబ్ల్యూహెచ్‌వో

జెనీవా‌: పేద దేశాలకు 2021 ప్రారంభంలోనే కరోనా వ్యాక్సిన్‌ లభ్యం అవుతుందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) తెలిపింది. ప్రపంచ దేశాలన్నింటికి సమాన స్థాయిలో వ్యాక్సిన్‌ను అందుబాటులోకి తెచ్చేందుకు కొన్ని దేశాలతో కలిసి డబ్ల్యూహెచ్‌వో.. కొవాక్స్‌ అనే గ్రూప్‌ను ఏర్పాటు చేసిన సంగతి తెలిసిందే.  

కొవాక్స్‌ గ్రూపు దేశాల కోసం తాము దాదాపు 200 కోట్ల వ్యాక్సిన్లను సేకరించగలిగినట్లు డబ్ల్యూహెచ్‌వో వెల్లడించింది. ఈ దేశాలన్నింటికి వచ్చే ఏడాది తొలి విడుత వ్యాక్సిన్లు తొలి అర్థభాగంలోకి అందుబాటులోకి వస్తాయని సంస్థ డైరెక్టర్‌ జనరల్‌ టెడ్రోస్‌ అధానోమ్‌ ఘేబ్రెయెస్‌ మీడియాకు చెప్పారు. ‘టన్నెల్‌ చివరికి వెళ్లే సరికి దీపం కాసింత కాంతివంతమవుతుంది’ అని వ్యాఖ్యానించారు. 

అమెరికా, ఆస్ట్రేలియా, బ్రిటన్‌తోపాటు యూరోపియన్‌ యూనియన్‌ సభ్య దేశాలు తమ దేశాల జనాభా కంటే అధికంగా వ్యాక్సిన్లను కొనుగోలు చేసేందుకు ఫార్మా సంస్థలతో ఒప్పందాలు కుదుర్చుకున్న సంగతి తెలిసిందే. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo