గురువారం 02 జూలై 2020
International - May 30, 2020 , 00:52:23

అక్టోబర్‌ చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌!

అక్టోబర్‌ చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌!

వాషింగ్టన్‌: అక్టోబర్‌ చివరికల్లా కరోనా వ్యాక్సిన్‌ సిద్ధం కావొచ్చని అమెరికా ఫార్మాస్యూటికల్‌ దిగ్గజ సంస్థ ‘ఫైజర్‌' సీఈవో ఆల్బర్ట్‌ బౌర్లా పేర్కొన్నట్లు ‘ది టైమ్స్‌ ఆఫ్‌ ఇజ్రాయెల్‌' వార్తాసంస్థ తెలిపింది. జర్మనీకి చెందిన బయోఎన్‌టెక్‌ సంస్థతో కలసి ఫైజర్‌ పరిశోధనలు చేస్తున్నది. మరోవైపు, ఈ ఏడాది చివరికల్లా రెండు మూడు వ్యాక్సిన్లు అందుబాటులోకి వస్తాయని అస్ట్రాజెనెకా అధిపతి పాస్కల్‌ సోరియట్‌ పేర్కొన్నట్లు ఆ వార్తా సంస్థ తెలిపింది. 


logo