శుక్రవారం 30 అక్టోబర్ 2020
International - Oct 13, 2020 , 11:48:25

రెండ‌వ‌సారి సోకితే.. ల‌క్ష‌ణాలు తీవ్రం

రెండ‌వ‌సారి సోకితే.. ల‌క్ష‌ణాలు తీవ్రం

హైద‌రాబాద్‌: కోవిడ్‌19 రెండ‌వ సారి సంక్ర‌మిస్తే, అలాంటి వారికి చాలా తీవ్ర‌మైన వైర‌స్ ల‌క్ష‌ణాలు న‌మోదు అవుతాయ‌ని అమెరికా డాక్ట‌ర్లు చెప్పారు. దీనికి సంబంధించి లాన్‌సెట్ జ‌ర్న‌ల్ లో ప‌రిశోధ‌న అంశాల‌ను ప్ర‌చురించారు.  క‌రోనా వైర‌స్ రెండ‌వ‌సారి సోకితే, అప్పుడు ల‌క్ష‌ణాలు మ‌రింత తీవ్రంగా ఉంటాయ‌ని లాన్‌సెట్ నివేదిక‌లో పేర్కొన్నారు. ఒక‌సారి వైర‌స్ నుంచి కోలుకుంటే, మ‌ళ్లీ రాద‌న్న గ్యారెంటీ లేద‌న్నారు. 25 ఏళ్ల నెవ‌డా పేషెంట్‌కు రెండు సార్లు భిన్న‌మైన క‌రోనా వైర‌స్‌లు 48 రోజుల తేడాలో సంక్ర‌మించాయ‌ని, రెండ‌వ సారి పేషెంట్ ఆక్సిజ‌న్ స‌పోర్ట్ చికిత్స తీసుకోవాల్సి వ‌చ్చింద‌న్నారు.  రీఇన్‌ఫెక్ష‌న్ కేసుల‌కు సంబంధించి లాన్‌సెట్ జ‌ర్న‌లో మ‌రికొన్ని నివేదిక‌లు జోడించారు.  బెల్జియం, నెద‌ర్లాండ్స్‌, హాంగ్‌కాంగ్, ఈక్వెడార్ దేశాల్లో కూడా ఇలాంటి రీఇన్‌ఫెక్ష‌న్ కేసులు న‌మోదు అయిన‌ట్లు పేర్కొన్న‌ది.