సోమవారం 28 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 16:40:00

2021 చివ‌ర‌కు క‌రోనా వెళ్లిపోతుంది : బిల్ గేట్స్‌

2021 చివ‌ర‌కు క‌రోనా వెళ్లిపోతుంది : బిల్ గేట్స్‌

హైద‌రాబాద్‌: వ‌చ్చే ఏడాది చివ‌ర వ‌ర‌కు కోవిడ్‌19 మ‌హ‌మ్మారి ఉంటుంద‌ని మైక్రోసాఫ్ట్ వ్య‌వ‌స్థ‌ప‌కుడు బిల్ గేట్స్ అంచ‌నా వేశారు.  అయితే వైర‌స్ అంతం అయ్యేలోగా.. పేద దేశాల్లో ల‌క్ష‌లాది మంది ప్ర‌జ‌లు చ‌నిపోయే ప్ర‌మాదం ఉంద‌ని ఆయ‌న అభిప్రాయ‌ప‌డ్డారు. ఓ ఆంగ్ల ప‌త్రిక‌కు ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో ఆయ‌న ఈ విష‌యాన్ని చెప్పారు.  క‌రోనా వైర‌స్‌కు వ్యాక్సిన్ త‌యారు చేస్తున్న కొన్ని ఫార్మా సంస్థ‌ల‌కు గేట్స్ ఫౌండేష‌న్ మిలియ‌న్ల డాల‌ర్ల స‌హాయం అందిస్తున్న‌ది. కేవ‌లం వైర‌స్ వ‌ల్ల‌నే జ‌నం చ‌నిపోరు అని, కానీ వైర‌స్ వ‌త్తిడి వ‌ల్ల దెబ్బ‌తిన్న ఆరోగ్య, ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల వ‌ల్ల మ‌ర‌ణాల సంఖ్య మ‌రింత పెరిగే అవ‌కాశం ఉంద‌న్నారు.  వైర‌స్ విష‌యంలో అమెరికాలో రాజ‌కీయాలు చేయ‌డం వ‌ల్ల ఆ వ్యాధిని నియంత్రంచ‌డం ఆల‌స్య‌మైంద‌న్నారు. 2021 చివ‌ర వ‌ర‌కు ప్ర‌భావంత‌మైన టీకా భారీ స్థాయిలో ఉత్ప‌త్తి జ‌రిగే అవ‌కాశం ఉన్న‌ట్లు ఆయ‌న చెప్పారు. మ‌హ‌మ్మారిని అడ్డుకునేందుకు చాలా వ‌ర‌కు ప్ర‌పంచ దేశాల‌కు టీకా అందుబాటులోకి వ‌స్తుంద‌న్నారు. బిలియ‌న్ల డాల‌ర్లు ఖ‌ర్చు చేసి టీకాను ఉత్ప‌త్తి చేస్తేనే.. దెబ్బ‌తింటున్న ట్రియ‌న్ల డాల‌ర్ల‌ ఆర్థిక వ్య‌వ‌స్థ‌ల‌ను ఆదుకోగల‌‌మ‌న్నారు.

 


logo