శుక్రవారం 10 జూలై 2020
International - Feb 12, 2020 , 19:12:23

కోవిద్‌-19 పేరు సూచించింది భార‌తీయ డాక్ట‌రే !

కోవిద్‌-19 పేరు సూచించింది భార‌తీయ డాక్ట‌రే !

హైద‌రాబాద్ : కోవిద్‌-19.. అంటే క‌రోనా వైర‌స్‌కు పెట్టిన కొత్త పేరు.  ఇది వ్యాధి పేరు.  ఈ పేరును ఫిక్స్ చేసింది ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ‌. అయితే ఆ వైర‌స్‌కు నామ‌క‌ర‌ణం చేసింది మాత్రం మ‌న భార‌తీయ డాక్ట‌రే.  ఆ డాక్ట‌ర్ పేరు సౌమ్యా స్వామినాథ‌న్‌. డ‌బ్ల్యూహెచ్‌వోలో ఆమె చీఫ్ సైంటిస్ట్‌గా చేస్తున్నారు. సీఓ అంటే క‌రోనా, వీఐ అంటే వైర‌స్‌, డీ అంటే డిసీజ్‌, 19 అంటే 2019లో ఆ వ్యాధి పుట్టింద‌ని అర్థం.  వ్యాధుల‌కు పేరు పెట్టాలంటే కొన్ని నిబంధ‌న‌లు ఉంటాయి. ఆ నిబంధ‌న‌ల ప్ర‌కార‌మే క‌రోనా వైర‌స్‌కు కోవిద్‌-19 అని పేరు పెట్టిన‌ట్లు డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ తెలిపారు. వ్యాధికి పేరు పెట్టిన‌ప్పుడు .. ఆ వ్యాధి పేరు ఓ ప్రాంతాన్ని కానీ, న‌గ‌రాన్ని కానీ సూచించ‌కుండా ఉండాలి. వ్యాధి పేరు కూడా ప‌ల‌క‌డానికి ఈజీగా ఉండాలి. క‌న్ఫూజ‌న్ ఉండకూడ‌దు, కానీ లాజిక్ మిస్ కావొద్దు. భ‌విష్య‌త్తు త‌రాలు తెలుసుకునే ర‌కంగా వ్యాధి పేరు ఉండాలి. క‌రోనా వైర‌స్ వ‌ల్ల వ‌చ్చే మిగ‌తా వ్యాధుల‌కు కూడా పెరు పెట్టేంత సులువుగా ఉండాల‌ని డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్ అన్నారు. హరిత‌విప్ల‌వ పితామ‌హుడు ఎంఎస్ స్వామినాథ‌న్ కూతురే డాక్ట‌ర్ సౌమ్యా స్వామినాథ‌న్‌.  నేటి వ‌ర‌కు చైనాలో క‌రోనా వైర‌స్ వ‌ల్ల మృతిచెందిన వారి సంఖ్య 1116కు చేరుకున్న‌ది. 


logo