మంగళవారం 22 సెప్టెంబర్ 2020
International - Sep 08, 2020 , 12:00:20

మార్కెట్లోకి ర‌ష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'

మార్కెట్లోకి ర‌ష్యా వ్యాక్సిన్ 'స్పుత్నిక్-వి'

బీజింగ్‌: క‌రోనా మ‌హ‌మ్మారి నివార‌ణ కోసం అభివృద్ధి చేసిన ర‌ష్యా వ్యాక్సిన్ స్పుత్నిక్‌-వి అందుబాటులోకి వచ్చింది. తాము అభివృద్ధి చేసిన 'స్పుత్నిక్‌-వి' వ్యాక్సిన్ తొలి బ్యాచ్‌ను మార్కెట్‌లోకి విడుదల చేసినట్లు రష్యా ఆరోగ్యశాఖ వెల్లడించింది. త్వరలోనే దీన్ని దేశవ్యాప్తంగా పంపిణీ చేస్తామని పేర్కొన్న‌ది. 'కరోనా వైరస్‌ను నియంత్రించడానికి గమాలియా నేషనల్ రిసెర్చ్‌ సెంటర్‌ అభివృద్ధి చేసిన ఈ వ్యాక్సిన్‌ అన్ని రకాల ప్రయోగ పరీక్షల్లో ఉత్తమ ఫలితాలు సాధించింది. అందువల్ల దీన్ని ప్రజలకు అందుబాటులోకి తెస్తున్నాం' అని రష్యా ఆరోగ్యశాఖ ఓ ప్రకటనలో పేర్కొన్న‌ది. 

కాగా, కరోనాకు తొలి వ్యాక్సిన్‌ను సిద్ధం చేసినట్లు రష్యా హెల్త్ మినిస్ట్రీ‌ గత ఆగస్టు 11న ప్రకటించింది. తమ వ్యాక్సిన్‌ కోసం పలు దేశాలు క్యూ కడుతున్నట్లు పేర్కొన్నంది. ఇప్పటివరకు దాదాపు బిలియన్‌ డోస్‌ల వ్యాక్సిన్‌ కోసం 20 దేశాలు ముందస్తుగా ఆర్డర్‌ చేశాయని ఈ వ్యాక్సిన్‌కు నిధులు సమకూరుస్తున్న రష్యన్‌ డైరెక్ట్‌ ఇన్వెస్ట్‌మెంట్‌ ఫండ్‌ సంస్థ వెల్లడించింది. ప్ర‌స్తుతం తొలి బ్యాచ్ వ్యాక్సిన్‌ను ప్ర‌జ‌ల్లోకి విడుద‌ల చేసిన ర‌ష్యా.. త్వ‌ర‌లోనే మ‌రికొన్ని డోస్‌ల‌ను అందుబాటులోకి తేవ‌డానికి య‌త్నిస్తుంది. 

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo