గురువారం 01 అక్టోబర్ 2020
International - Jul 30, 2020 , 15:30:11

అమెరికాలో కరోనా మృత్యు హేళ

అమెరికాలో కరోనా మృత్యు హేళ

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా మృత్యు విలయం సృష్టిస్తోంది.  రోజురోజుకూ పాజిటివ్‌ కేసుల సంఖ్య వేలల్లో పెరుగుతుండగా మరణాలు అంతకంతకు పెరుగుతుండడం ఆందోళన కలిసిస్తోంది. ఇప్పటివరకు ఆ దేశవ్యాప్తంగా 4.4 మిలియన్ల మంది వైరస్‌ బారినపడగా మృత్యుల సంఖ్య 1.5 లక్షలు దాటిందని ప్రఖ్యాత జాన్‌ హప్కిన్‌ యూనివర్సిటీ తన నివేదికలో వెల్లడించింది.

ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 16 మిలియన్ల మంది కరోనా బారినపడగా 6 లక్షల 60 వేల మందికిపైగా మృత్యువాతపడ్డారని పేర్కొంది. అమెరికాలో తొలి కరోనా మరణం ఫిబ్రవరి 29న సంభవించగా కేవలం 54 రోజుల్లో (ఏప్రిల్‌23) వరకు మృత్యుల సంఖ్య 50 వేలకు చేరింది. మరో 34 రోజులు (మే23) వరకు లక్షకు పెరిగింది. ఆ తరువాతి 63 రోజుల్లో 1.5 లక్షల మార్కును దాటిందని సీఎన్‌ఎస్‌ తన నివేదకలో పేర్కొంది. 


logo