మంగళవారం 29 సెప్టెంబర్ 2020
International - Sep 02, 2020 , 20:04:11

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25.6 మిలియన్లు!: జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ

ప్రపంచవ్యాప్తంగా కరోనా కేసుల సంఖ్య 25.6 మిలియన్లు!: జాన్‌ హాప్కిన్స్‌ వర్సిటీ

వాషింగ్టన్‌: ప్రపంచవ్యాప్తంగా మొత్తం కరోనా కేసుల సంఖ్య 25.6 మిలియన్లకు చేరుకుంది. మరణాలు 8,55,000 కు చేరుకున్నాయి. ఈ వివరాలను జాన్స్ హాప్కిన్స్ విశ్వవిద్యాలయం విడుదల చేసింది. బుధవారం ఉదయం నాటికి మొత్తం కేసుల సంఖ్య 2,56,60,482 కాగా, మరణాలు 8,55,444 కు పెరిగాయని యూనివర్సిటీ సెంటర్ ఫర్ సిస్టమ్స్ సైన్స్ అండ్ ఇంజినీరింగ్ (సీఎస్‌ఎస్‌ఈ) వెల్లడించింది. సీఎస్‌ఎస్‌ఈ ప్రకారం ప్రపంచంలోనే అత్యధికంగా అమెరికాలో  6,073,174 కొవిడ్‌ కేసులు నమోదుకాగా, 1,84,644 మరణాలు సంభవించాయి. 39,50,931 ఇన్ఫెక్షన్లు, 1,22,596 మరణాలతో బ్రెజిల్ రెండోస్థానంలో నిలిచింది. 

కేసుల విషయానికొస్తే, భారతదేశం (3,691,166) మూడో స్థానంలో ఉంది. ఆ తర్వాత రష్యా (9,97,072), పెరూ (6,52,037), దక్షిణాఫ్రికా (6,28,259), కొలంబియా (6,15,094), మెక్సికో (6,06,036), స్పెయిన్ (4,70,973), అర్జెంటీనా (4,28,239) ), చిలీ (4,13,145), ఇరాన్ (3,76,894), యూకే (3,39,385), ఫ్రాన్స్ (3,23,968), సౌదీ అరేబియా (3,16,670), బంగ్లాదేశ్ (3,14,946), పాకిస్తాన్ (2,96,149), టర్కీ (2,71,705), ఇటలీ (2,70,189), జర్మనీ (1,05,872) ఉన్నాయి.

10,000 మందికి పైగా మరణాలు నమోదైన దేశాలు చూసుకుంటే భారత్ (65,288), మెక్సికో (65,241), యూకే (41,592), ఇటలీ (35,491), ఫ్రాన్స్ (30,666), స్పెయిన్ (29,152), పెరూ (28,944), ఇరాన్ (21,672), కొలంబియా (19,662), రష్యా (17,250), దక్షిణాఫ్రికా (14,263), చిలీ (11,321) ఉన్నాయి.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo