మంగళవారం 11 ఆగస్టు 2020
International - Jul 13, 2020 , 22:12:15

అమెరికాలో కరోనా విలయం

అమెరికాలో కరోనా విలయం

వాషింగ్టన్‌ : అమెరికాలో కరోనా మహమ్మారి విలయం సృష్టిస్తోంది. ప్రపంచంలోనే అత్యధికంగా పాజిటివ్‌ కేసులు ఇక్కడే నమోదువుతున్నాయి. నిత్యం వేల సంఖ్యలో కేసులు నమోదువుతుండడంతో అమెరికన్లు హడలిపోతున్నారు. గడిచిన 24గంటల వ్యవధిలో ఇక్కడ 61,352 మంది కరోనా బారినపడగా 685 మంది మృతి చెందారు. శనివారం ఒక్కరోజే ఆ దేశంలో రికార్డుస్థాయిలో 66,627 మంది వైరస్‌ బారినపడగా 802 మంది మృతి చెందారు. అమెరికాలో ఇప్పటివరకు 3.2 మిలియన్ల మంది కరోనా బారినపడగా 1,34,815 మంది మృతి చెందారు. 9,95,576 మంది చికిత్సకు కోలుకొని దవాఖానల నుంచి డిశ్చార్జి అయ్యారు. ఇదిలా ఉండగా ప్రపంచ వ్యాప్తంగా 12.7 మిలియన్ల మంది కరోనా బారినపడ్డారని, 5 లక్షల 65 వేల మంది తీవ్రమైన ఇన్‌ఫెక్షన్‌ కారణంగా మృతి చెందారని అమెరికాకు చెందిన ప్రఖ్యాత జాన్‌ హాప్కిన్స్‌ విశ్వవిద్యాలయం నివేదించింది.


logo