శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Sep 03, 2020 , 11:57:49

పాకిస్తాన్‌లో క‌రోనా త‌గ్గుముఖం.. వాళ్లే కార‌ణ‌మ‌ట‌!

పాకిస్తాన్‌లో క‌రోనా త‌గ్గుముఖం.. వాళ్లే కార‌ణ‌మ‌ట‌!

ఇండియా, అమెరికా, యూకే వంటి వంటి దేశాల‌లో క‌రోనా కేసులు రోజురోజుకు పెరుగుతుంటే పాకిస్తాన్‌లో మాత్రం కేసులు త‌గ్గుముఖం ప‌డుతున్నాయి. ప‌దుల సంఖ్య నుంచి సింగిల్ డిజిట్‌కు కేసులు న‌మోదు అవ్వ‌డంతో అంద‌రూ ఆశ్చ‌ర్యానికి గుర‌వుతున్నారు. అస‌లు అక్క‌డ‌ ట్రీట్‌మెంట్‌కు స‌రిప‌డా స‌దుపాయాలు కూడా ఉండ‌వు. మ‌రెలా కేసులు త‌గ్గుతున్నాయ‌ని ప్ర‌శ్నిస్తే.. అక్క‌డ ఎక్కువ‌మంది యువ‌త‌లే ఉంటారు. వీరికి రోగ‌నిరోధ‌క శ‌క్తి ఎక్కువ‌గా ఉంటుంది. ఒక‌వేళ క‌రోనా వ‌చ్చినా హాస్పిట‌ల్‌కు వెళ్ల‌కుండానే త‌గ్గించుకుంటున్నారు. దీంతో క‌రోనా త‌గ్గుముఖం ప‌డుతుంద‌ని చెబుతున్నారు. అంతేకాకుండా అక్క‌డ వృద్దులు త‌క్కువ సంఖ్య‌లో ఉంటారు.

అయితే పాకిస్తాన్‌లో కేసులు వ‌స్తున్నా బ‌య‌ట‌కు చెప్ప‌డం లేదేమో అంటున్నారు. ఇరుకు ఇండ్ల‌లో జీవించే వారికి క‌రోనా రాక‌పోవ‌మేంటి అని వాపోతున్నారు. లాహోర్‌లోని సర్వీసెస్ హాస్పిటల్ డాక్టర్ సల్మాన్ హసీబ్ దీని గురించి మాట్లాడుతూ.. ‘‘ఈ కేసులు ఎలా తగ్గుతున్నాయనేది ఎవరూ చెప్పలేకపోతున్నాం. ప్రత్యేకంగా ఈ చర్యలు చేపడుతున్నాం అని ఖచ్చితంగా చెప్పలేం’’ అని తెలిపారు. అయితే, పాక్‌లోని పరిస్థితుల వల్లే.. కరోనా కేసులు వ్యాప్తి జరగడం లేదని అంచనా వేస్తున్నారు.


logo