శనివారం 19 సెప్టెంబర్ 2020
International - Aug 11, 2020 , 16:45:52

బంగ్లాదేశ్‌లో 2,63,503కు పెరిగిన కరోనా కేసులు

బంగ్లాదేశ్‌లో 2,63,503కు పెరిగిన కరోనా కేసులు

ఢాకా: మన పక్కదేశం బంగ్లాదేశ్‌నూ కరోనా కలవర పెడుతోంది. ఆ దేశంలో కేసుల సంఖ్య మూడు లక్షల చేరువకు వచ్చింది. గడిచిన 24 గంటల్లో బంగ్లాదేశ్‌లో 2,996 కొత్త కొవిడ్ -19 పాజిటివ్ కేసులు, 33 మరణాలు నమోదయ్యాయని ఆ దేశ ఆరోగ్య మంత్రిత్వ శాఖ సీనియర్ అధికారి నసీమా సుల్తానా ఒక ప్రకటనలో తెలిపారు. ఒకేరోజు దాదాపు 3 వేల కొత్త కేసులు నమోదు కావడంతో బంగ్లాదేశ్‌లో కేసుల సంఖ్య  2,63,503 కు చేరుకుంది. ఇప్పటివరకూ మహమ్మారి బారినపడి  3,471 మంది మరణించినట్లు నసీమా సుల్తానా తెలిపారు.

దేశవ్యాప్తంగా గత 24 గంటల్లో 14,820 నమూనాలను పరీక్షించినట్లు చెప్పారు. దేశంలో కోలుకున్న రోగుల సంఖ్య 1,51,972 గా ఉందని స్పష్టంచేశారు. కొవిడ్‌ మరణాల రేటు 1.32 శాతం ఉండగా, రికవరీ రేటు 57.67 శాతం ఉన్నట్లు చెప్పారు. కరోనాతో ఇప్పటివరకూ జూన్‌ 30న అత్యధికంగా 64 మంది మరణించారని, జూలై 2న అత్యధికంగా రోజువారీ 4,019 కేసులు నమోదయ్యాయని వివరించారు.   


logo