శుక్రవారం 05 జూన్ 2020
International - May 06, 2020 , 17:36:06

బంగ్లాదేశ్‌లో 11,719కి చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు

బంగ్లాదేశ్‌లో 11,719కి చేరుకున్న క‌రోనా పాజిటివ్ కేసులు

ఢాకా: బ‌ంగ్లాదేశ్‌లో ఈ రోజు కొత్త‌గా గ‌డిచిన‌24 గంట‌ల్లో 790 క‌రోనా పాజిటివ్ కేసులు న‌మోదు కావ‌డంతో ఆదేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు న‌మోదైన కేసుల సంఖ్య 11,719కి చేరుకుంది. వైర‌స్ బారిన ప‌డి ఈ రోజు ముగ్గురు మృత్యువాత ప‌డిన‌ట్లు డైరెక్ట‌రేట్ జ‌న‌ర‌ల్ ఆఫ్ హెల్త్ స‌ర్వీసెస్ అద‌న‌పు డైరెక్ట‌ర్ జ‌న‌ర‌ల్ నాసిమా సుల్తానా ప్ర‌క‌టించారు. మృతుల్లో ఇద్ద‌రు 60 సంవ‌త్స‌రాలు పైబ‌డిన వార‌ని, ఒక‌రు 41 సంవ‌త్స‌రాల వ‌య‌స్సు ఉంటుంద‌ని తెలిపారు. వారిలో ఇద్ద‌రు పురుషులు కాగా, ఒక‌రు మ‌హిళ‌గా పేర్కొన్నారు. దేశంలో ఇప్ప‌టి వ‌ర‌కు వైర‌స్ కార‌ణంగా మ‌ర‌ణించిన వారి సంఖ్య 186కు చేరుకుంది. 


logo