మంగళవారం 26 మే 2020
International - Apr 18, 2020 , 20:57:26

బీటలు వారిన ఆస్ట్రేలియా విద్యార్థుల కలల సౌధం

బీటలు వారిన  ఆస్ట్రేలియా విద్యార్థుల కలల సౌధం

వలసలకు హద్ద్దులు , ఎల్లలు లేవు .మానవులు  సప్త సముద్రాలూ కూడా దాటి భవిష్యత్తు వెతుక్కుంట్టారు .వలసల వల్ల మానవాభివృద్ధి,సమాజం లో మార్పు ,సంపద సృష్టికి బాటలు వేస్తున్నాయి . ఉన్న ఊరిని వదిలిపెట్టి వెళ్లినవారు  పేదరికం నుంచి బయటపడటం ఖాయమని ఒక కఛ్చితమైన  అభిప్రాయం సమాజం లో ఉంది . వలస వెళ్లిన కుటుంబాలు  దారిద్య్రాన్ని అధిగమించినట్లు  సర్వే లు కూడా వెల్లడిస్తున్నాయి.  కరోనా నేపథ్యం లో లాక్డౌన్ పర్యవసానంగా  ఆస్ట్రేలియా  లో స్థిర పడ్డ భారతీయులకు ఇప్పుడు అక్కడ ఎటువంటి ఇబ్బంది లేదు ,ఇక్కడి  ప్రభుత్వం వారి పరిధి కి మించి అన్ని విధాలుగా  వాళ్ళను ఆదుకుంటుంది. దురదృష్టవశాత్తు విద్యార్థులుగా వచ్చిన వారు ఇక్కడి ప్రభుత్వ పరిధి లోకి రాకపోవడం వల్ల ఆస్ట్రేలియా ప్రభుత్వం వీరిని ఆదుకునే పరిస్థితి లేదు.ఉన్నత విద్య , తరువాత గొప్ప ఉపాధి అవకాశాలు లభిస్తాయని కొన్ని వేలమంది విద్యార్థులు ఆస్ట్రేలియా లకు వలస వెళ్లడం జరిగింది .సుమారుగ  నాలుగు    వేల మంది విద్యార్థులు 2009 లో తెలంగాణ రాష్ట్రం  నుండి ఆస్ట్రేలియా వెళ్లడం జరిగింది .

అంతా సవ్యంగానే జరుగుతున్నా తమ జీవితాల్లో ఒక్క సరిగా COVID 19 అనే వైరస్ వల్ల వాళ్ళ  జీవితం తలకిందులైంది . తాము యూనివర్సిటీ లలో చదువుతూ తమ ఖర్చుల కోసం పార్ట్ టైం లు చేస్తున్న విద్యార్ధులందరి ఉద్యోగాలు లాక్డౌన్  వాళ్ళ  కోల్పోయారు.తమ ఇంటి అద్దె ,నిత్యావసర సరుకులు ,యూనివర్సిటీ ఫీజు లు కట్టుకోలేక విపరీతమైన ఒత్తిడి ఎదుర్కొంటున్నారు . ఇటువంటి సంక్షోభ  సమయంలో ఇక్కడి ప్రభుత్వాలు ఆదుకోవడం సమంజసం ,కానీ ఇక్కడి ప్రభుత్వం కేవలం ఆస్ట్రేలియా సిటిజెన్ లను మాత్రమే ఆదుకుంటామని ప్రకటించడం ,అంతే కాకూండా ఆస్ట్రేలియా ప్రధాన మంత్రి స్కాట్ మోరీసన్ మాట్లాడుతూ ఇంటర్నేషనల్ స్టూడెంట్స్ ఇక్కడ కష్టాలు ఎదుర్కొంటే నిరభ్యన్తరంగా తమ  దేశాలకు తిరిగి వెళ్లి పోయచ్చు అని కఠినంగా చెప్పడంతో మన విద్యార్థులు తీవ్ర దిగ్బ్రఅంతి   కి గురయ్యారు. లాక్డౌన్ వల్ల తమ దేశాలకు వెళ్లలేక ఇక్కడ ఉండలేక ఇబ్బంది పడుతున్నారు . ఒకప్పుడు ధనిక కుటుంబాలు మాత్రమే విదేశాలకు ఉన్నత చదువుల కోసం వచ్చేవారు ,కానీ ఇప్పడు పేదవారికి ,వెనుక పడ్డ కులాలకు ప్రభుత్వం స్కాలర్షిప్  ఇవ్వడం తో మధ్య తరగతి ,పేద కుటుంబాలకు చెందిన విద్యార్థులు కూడా ఆస్ట్రేలియా కు వెళ్లారు .వీరు మన తెలంగాణ రాస్ష్ట్రం నుండి సుమారుగా నాలుగు   వేల మంది ఉన్నారు ,ఇందులో చాలా మంది ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు .కొంత మంది బ్యాంకు లోన్ లో తీసుకుని రావడం జరిగింది .ఆస్ట్రేలియా లోని మెల్బోర్న్ ,సిడ్నీ  లో వీరు అధికంగా ఉన్నారు ,

అలాగే బ్రిస్బేన్ ,కాన్బెర్రా ,అడిలైడ్ లో కూడా మన విద్యార్థులు ఉన్నారు. ప్రతీ సంవత్సరం దాదాపు 25 నుండి ౩౦ లక్షల వరకు ఫీజు లు వసూలు చేస్తున్న యూనివర్సిటీ లు కూడా తమ విద్యార్థులకు సహాయం చేయకుండా చేతులెత్తేశాయి . తెలంగాణ కు చెందిన కొంత మంది ఇక్కడ స్థిర పడ్డ వారు భోజనానికి ఇబ్బంది పడుతున్న మన విద్యార్థులకు నిత్యవసర సరుకులు అందిస్తూ సహాయ పడుతున్నారు. ఇక్కడి అద్దెలు కట్టలేక వీధిన పడుతున్న విద్యార్థులను , మన దేశానికి రావాలనుకున్న విద్యార్థులను కేంద్ర ,రాష్ట్ర ప్రభుత్వాలు చొరవ చూపెట్టి తీరిగి తమ రాష్ట్రానికి తీసుకు రావడానికి తగు చర్యలు తీసుకోవాలని విద్యార్థులు కోరుతున్నారు .అలాగే స్టూడెంట్స్ లోన్స్ ద్వారా వచ్చిన విద్యార్థులు తమ ఇన్స్టాల్మెంట్స్ కట్టలేక ,తల్లిదండ్రులను ఇబ్బంది పెట్ట లేక సతమతమవుతున్నారు . తమ ఇబ్బందులను కనీసం తమ తల్లి దండ్రులతో ,బంధువులతో పంచుకోలేని స్థితి లో ఉన్నారు. ఇక విద్యార్థులు పరిస్థితి ఇలా ఉంటె , ఇక్కడ స్థిర పడ్డ వారి పరిస్థితి కూడా కష్టం గానే ఉంది , చాల మంది తమ ఉద్యోగాలు కోల్పోయి దిక్కు లేని పరిస్థితులలో ఉన్నారు. వృద్ధులైన తమ తల్లి దండ్రుల చెంత కు వెళ్లి వాళ్లకు ఇటువంటి కష్ట కాలం లో అండగా ఉండలేని పరిస్థితి . తమ వారికి ఏమైనా జరిగిన ఇప్పుడు స్వదేశానికి రాలేని దుస్థితి లో ఉన్నారు.
దాదాపు ప్రతీ విద్యార్ధి తమ ఇంటి అద్దె , ఇతర ఖర్చులు, యూనివర్సిటీ ఫీజూలు ,బ్యాంకు లోన్ లకు ఇన్స్టాల్మెంట్స్ ,తమ తల్లి దండ్రులకు ఖర్చుల కోసం కొద్దో గొప్పో పంపే స్థాయి  వరకు తమ పార్ట్ టైం ద్వారా సంపాదిస్తారు .ఒకరికి కష్టం వస్తే మిగతా విద్యార్థులు ఆదుకుని  ముందుకు వెళ్లే వాళ్ళు ,కానీ ఇప్పుడు ప్రతీ ఒక్కరి పరిస్థితి ఒకేలా ఉండడంతో ఒకరిని ఒకరు ఆదుకునే  పరిస్థితి లేదు.
కేవలం హైదరాబాద్ ,రంగారెడ్డి జిల్లా నుండి సుమారుగా వెయ్యి మంది విద్యార్థులు 2019 లో ఇక్కడికి వచ్చారు . పూర్వపు కరీంనగర్,నిజామాబాదు,వరంగల్ ,ఆదిలాబాద్ నుండి సుమారుగా పదిహేను వందల మంది విద్యార్థులు ,మిగతా జిల్లాల నుండి పదిహేనువందల మంది విద్యార్థులు ఉన్నత చదువుల కోసం ఆస్ట్రేలియా రావడం జరిగింది . పూర్వ విద్యార్థులు తమ చదువులు ముగించి ఇంకా స్థిరపడని విద్యార్థులు వేలల్లో ఉన్నారు .
ఎంత మంది తమ రాష్ట్రం నుండి విదేశాలకు వెళ్తున్నారో ,ఎక్కడికి వెళ్తున్నారో అని కచ్చితంగా చెప్పగలికే ఎటువంటి వ్యవస్థ  మన రాష్ట్రం లోకానీ ,దేశం లో కానీ  ఇప్పటికి లేకపోవడం మన ప్రభుత్వాలు ఆలోచించదగ్గ విషయమే .ఇప్పటికైనా దేశ ,రాష్ట్ర ప్రభుత్వాలు స్పందించి విదేశాలలో కష్టాలు ఎదుర్కుంటున్న తమ బిడ్డలకు చేయూతనందించాలి . ఇటువంటి క్లిష్ట సమయాలలో భారత రాయబార కార్యాలయాలు తోడ్పాటు ని అందిస్తాయి ,కానీ ఒకే సారి ఇంత మందికి సహాయం చేసే వ్యవస్థ ఇక్కడి కార్యాలయాలకు లేకపోవడం చింతించాల్సిన పరిణామమే. బ్యాంకులు కూడా ఇక్కడి విద్యార్థుల పరిస్థితులను పరిగణాలకి తీసుకుని స్టూడెంట్స్ లోన్ ఇన్స్టాల్మెంట్స్ లను వాయిదా వేస్తె  అటు తల్లి దండ్రులకు ,ఇటు విద్యార్థులకు మేలు జరుగుతుంది.ఎందుకంటే అక్కడ తల్లిదండ్రుల పరిస్థితి ఇక్కడ వీళ్ళ పరిస్థితి ఒకేలా ఉంది
ఆస్ట్రేలియా లో  విద్యార్థులు పడే ఇబ్బందులను  చూసి ,వారికీ సరిపడే నిత్యావసర  సరుకులు  మన తెలంగాణా బిడ్డలు ముందు కు వచ్చి వారికి చేతనైన సహాయం చేస్తున్నారు భోజనానికి ఇబ్బంది పడుతున్న విద్యార్థులు ఆస్ట్రేలియా లో ప్రాంతం లో ఉన్న సరే వారిని మన తెలంగాణ బిడ్డలు ఒకరికొకరు చేయూతనిస్తున్నారు .తెలంగాణ కు చెందిన కొన్ని సంస్థలు , ఇక్కడ స్థిరపడ్డ  వాళ్ళు కూడా తమకు తోచిన సహాయం చేస్తున్నారు.విద్యార్థులు ఎక్కడ ఉన్నప్పటికినీ వారికి దగ్గర్లో ఉన్న దాత ద్వారా వారికి నిత్యావసర సరుకు చేరవేరుస్తున్నారుఅంతే కాకుండా ఇక్కడ యూనివర్సిటీ  యాజమాన్యాలను విద్యార్థులకు తాము కట్టిన  ఫీజు నుండి 20 శాతం తిరిగి విద్యార్థులకు కష్ట కాలం లో చెల్లించి మల్లి అన్ని సర్దుకున్నాక తిరిగి తీసుకునేలా ఆదుకోవాలని విజ్ఞప్తులను అందిస్తున్నారు.యూనివర్సిటీ అఫ్ సౌత్ ఆస్ట్రేలియా స్వతహాగా  తమ విద్యార్థులను ఆదుకోవడానికి ముందుకు వచ్చారు .అంతే కాకుండా వాళ్ళు విద్యార్థులకు పార్ట్ టీం ఉపాధి కై కృషి చేస్తున్నారు.


కాసర్ల నాగేందర్ రెడ్డి , ప్రెసిడెంట్టీఆర్ఎస్ ఆస్ట్రేలియా


logo