ఆదివారం 05 జూలై 2020
International - Jun 06, 2020 , 03:02:25

బ్లడ్‌ గ్రూపు-ఏతో ముప్పు

బ్లడ్‌ గ్రూపు-ఏతో ముప్పు

న్యూయార్క్‌: కరోనా సోకిన కొందరిలో అసలు లక్షణాలే కనిపించడం లేదు. మరికొందరిలో ఇది తీవ్రమైన అనారోగ్యానికి, మరణానికి కారణం అవుతున్నది. మనుషుల జన్యుక్రమాల్లో తేడాలే కారణమని జర్మనీ యూనివర్సిటీ ఆఫ్‌ కీల్‌ శాస్త్రవేత్తలు తేల్చారు. రక్తం గ్రూపును నిర్ణయించే జన్యువు కరోనా తీవ్రతను ప్రభావితం చేస్తున్నదని ఆ యూనివర్సిటీ శాస్త్రవేత్త అండ్రూ ఫ్రాంక్‌ తెలిపారు.  ఏ-బ్లడ్‌ గ్రూప్‌ ఉన్నవారు మరణించే ప్రమాదం 50శాతం ఎక్కువగా ఉన్నదని చెప్పారు. 


logo