శుక్రవారం 18 సెప్టెంబర్ 2020
International - Jul 18, 2020 , 17:11:59

మేజ‌ర్ ట్ర‌య‌ల్స్‌లో కోవిడ్‌-19 యాంటీబాడీ టెస్ట్ పాస్‌

మేజ‌ర్ ట్ర‌య‌ల్స్‌లో కోవిడ్‌-19 యాంటీబాడీ టెస్ట్ పాస్‌

యూకే : యూకేలో కోవిడ్‌-19 యాంటీబాడీ ప‌రీక్ష‌లు 98.6 శాతం ఖ‌చ్చిత‌త్వంతో ఉత్తీర్ణ‌త సాధించిన‌ట్లు డైలీ టెలీగ్రాఫ్ న్యూస్‌పేప‌ర్ తెలిపింది. యూకే ప్ర‌భుత్వం మొద‌టి మేజ‌ర్ ట్ర‌య‌ల్స్‌ను పాస్ చేసిన అనంత‌రం ల‌క్ష‌ల్లో క‌రోనా వైర‌స్ యాంటీబాడీ టెస్ట్‌ల‌ను ఉచితంగా పంపిణీ చేసేందుకు బ్రిట‌న్ మంత్రులు ప్ర‌ణాళిక‌లు ర‌చిస్తున్న‌ట్లుగా పేర్కొంది. ఈ ఏడాది చివరిలోపు మాస్ స్క్రీనింగ్ కార్యక్రమంలో ఉపయోగం కోసం ఎబిసి -19 ల్యాట‌ర‌ల్ ఫ్లో టెస్ట్ అందుబాటులో ఉంటుందని మంత్రులు భావిస్తున్నారని వార్తాపత్రిక తెలిపింది.

ఫింగర్ ప్రిక్ పరీక్షల ద్వారా ఓ వ్య‌క్తి క‌రోనా వైర‌స్ భారిన ప‌డింది లేనిది 20 నిమిషాల్లో 98.6 శాతం ఖ‌చ్చిత‌త్వంతో తెలుసుకోవ‌చ్చు. జూన్‌లో నిర్వ‌హించిన ర‌హ‌స్య ప‌రీక్ష‌ల్లో ఇప్ప‌టికే ఈ విష‌యం నిర్ధార‌ణ అయింది. యూకే ర్యాపిడ్ టెస్ట్ క‌న్సార్టియం(యూకే-ఆర్‌టీసీ), ఆక్స్‌ఫ‌ర్డ్ యూనివ‌ర్సిటీ, ప్ర‌ముఖ యూకే డ‌యాగ్న‌స్టిక్స్ ఫిర్మ్స్ సంయుక్తంగా ఈ టెస్ట్‌ను అభివృద్ధి చేశాయి. 


logo