బుధవారం 21 అక్టోబర్ 2020
International - Oct 17, 2020 , 17:50:30

బిడ్డకు ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ పేరు : 18 ఏండ్లపాటు ఉచిత వైఫై

బిడ్డకు ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ పేరు : 18 ఏండ్లపాటు ఉచిత వైఫై

బెర్న్‌ : తమకు పుట్టిన బిడ్డకు మంచి పేరు పెట్టాలని ప్రతీ ఒక్క తల్లిదండ్రులు భావిస్తుంటారు. తమ ఇష్టదైవం పేరుగానీ, తమ తాత పేరుగానీ, తమ అభిమాని పేరుగానీ వచ్చేలా పిల్లలకు పేర్లు పెట్టడం చూస్తుంటాం. అయితే స్విట్జర్ల్యాండ్‌లో ఓ జంట తమకు పుట్టిన బిడ్డకు ఇంటర్నెట్‌ ప్రొవైడర్‌ పేరు పెట్టుకున్నారు. దాంతో ఆ పాప 18 సంవత్సరాల వయసు వచ్చేంత వరకు వారు ఉచిత వైఫై పొందడానికి అర్హత సాధించారు.

ట్విఫై అనే స్విస్ స్టార్ట్-అప్ సంస్థ ఫేస్‌బుక్‌లో ఒక ప్రకటనను ప్రచురించింది. ఎవరైతే తమకు పుట్టిన బిడ్డకు తమ సంస్థ పేరు పెట్టుకుంటే.. ఆ పాప 18 సంవత్సరాల వయసు వరకు ఉచితంగా వైఫైని అందిస్తామని హామీ ఇచ్చారు. ట్విఫియా, ట్విఫస్, ట్విఫి.. ఇలా ఏపేరు పెట్టుకున్నా సరే ఉచిత వైఫై కల్పిస్తామని చెప్పడంతో.. స్విట్జర్ల్యాండ్‌కు చెందిన ఓ జంట తమ ట్విఫియా అని పేరు పెట్టుకున్నారు. దాంతో ట్విఫై సంస్థ గతంలో హామీ ఇచ్చినట్లు వారికి 18 ఏండ్ల పాటు ఉచిత వైఫై ఇచ్చేందుకు చర్చలు తీసుకుంటున్నట్లు వెల్లడించింది. వైఫై కోసం చేయాల్సిన ఖర్చు డబ్బులను తమ కుమార్తె పేరిట పొదుపు చేస్తామని పాప తండ్రి లాడ్బిబుల్‌ చెప్పారు. "ఇది మా సంస్థకు గౌరవప్రదమైన విషయం" అని ట్విఫై సంస్థ వ్యవస్థాపకుడు, సీఈఓ ఫిలిప్ ఫోట్ష్ తెలిపారు. తమ కంపెనీ పతనమైనప్పటికీ.. ఈ జంటకు ఇంటర్నెట్ సౌకర్యం కల్పించాల్సి ఉంటుంది.

లోక‌ల్ టు గ్లోబ‌ల్‌.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్‌లో. న‌మ‌స్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్‌లోడ్ చేసుకోండి.


logo