ఆదివారం 20 సెప్టెంబర్ 2020
International - Jul 14, 2020 , 19:53:47

62 ఏళ్ల దాంపత్యం.. ఆఖరి ఫోటో

62 ఏళ్ల దాంపత్యం.. ఆఖరి ఫోటో

క‌రోనా మ‌హ‌మ్మారి వ్యాప్తి చెందిన‌ప్ప‌టి నుంచి ప‌లు దేశాల్లో శ‌వాలు కుప్పలు కుప్పలుగా పేరుకుపోయాయి. వ‌య‌సు మీద ప‌డ్డ వారికి క‌రోనా అత్యంత హాని క‌లిగించి వారి ప్రాణాల‌ను బ‌లి తీసుకుంది. క‌రోనాతో చ‌నిపోయిన కొంత‌మంది వృద్ధుల బాధ‌ల‌ను, ఆ దృశ్యాల‌ను చూసి ప్ర‌పంచం చ‌లించిపోయింది. అలాంటి వృద్ధుల క‌డ‌సారి వీడ్కోలు క‌న్నీళ్లు తెప్పించాయి. ఓ 53 ఏళ్ల జంట ఒక‌రినొక‌రు చేతులు ప‌ట్టుకుని క‌రోనాతో మ‌ర‌ణించారు. ఈ దృశ్యాల‌ను హృద‌యాల‌ను ద్ర‌వీంప‌జేశాయి. 

ఈ సంఘ‌ట‌న‌కు క‌రోనాతో సంబంధం లేదు కానీ.. క‌రోనా రోగుల మాదిరిగానే.. ఓ వృద్ధుడు చివ‌ర‌గా త‌న భార్య చేతిలో చేయి వేసి ప్రాణాలు విడిచాడు. యూకేలో చోటు చేసుకున్న ఈ హృద‌య విదార‌క దృశ్యం సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ఈ దృశ్యాల‌ను చూసి నెటిజ‌న్లు క‌న్నీటి ప‌ర్యంత‌మ‌య్యారు. 

జో విల్స‌న్(92) అనే వృద్ధుడు క్యాన్స‌ర్ తో బాధ‌ప‌డుతున్నాడు. మే నెల‌లో ఆయ‌న క్వీన్ హాస్పిట‌ల్ లో చేరి చికిత్స పొందుతున్నారు. విల్స‌న్ కు తోడుగా ఆయ‌న భార్య మార్జోరీ(88) కూడా ఆస్ప‌త్రికి వ‌చ్చి సేవ‌లందించింది. కానీ కొన్ని రోజుల త‌ర్వాత ఆమెను న‌ర్సింగ్ హోంకు ఆస్ప‌త్రి న‌ర్సు త‌ర‌లించారు. విల్స‌న్ చ‌నిపోతాడని నిర్ధారించుకున్న న‌ర్సు ఎమ్మా.. ఆ కుటుంబానికి గుర్తుండిపోయే ఓ చిరు ప్ర‌య‌త్నం చేసింది. విల్స‌న్, మార్జోరీని ప‌క్క‌ప‌క్క బెడ్ల‌పై ఉంచారు. ఆ దంప‌తులిద్ద‌రూ ఒక‌రి చేతులు మ‌రొక‌రు ప‌ట్టుకున్నారు. అలా ప‌ది నిమిషాల పాటు వారిని వ‌దిలేసి ఎమ్మా ఫోటో తీసింది. 

చివ‌ర‌కు జూన్ 15న విల్స‌న్ తుదిశ్వాస విడిచాడు. ఎమ్మా తీసిన చిత్రాన్ని చూసి విల్స‌న్ కుటుంబం సంతోషించింది. ఈ ఫోటోను చూసిన ప్ర‌తి ఒక్క‌రూ విల‌పించార‌ని ఎమ్మా తెలిపింది. 60 ఏళ్ల దాంపత్య జీవితం వారిది. మ‌ళ్లీ వారు క‌లుసుకోలేర‌ని తెలిసీ ఇలా ఫోటో తీశాన‌ని ఎమ్మా పేర్కొంది. 


logo