శనివారం 30 మే 2020
International - Apr 23, 2020 , 09:34:13

నెల‌రోజులుగా స‌ముద్రంలోనే.. క‌రోనా గురించి తెలియ‌దంటున్న జంట‌

నెల‌రోజులుగా స‌ముద్రంలోనే.. క‌రోనా గురించి తెలియ‌దంటున్న జంట‌

ఇప్పుడు అంద‌రి నోళ్ళ‌ల్లో నానుతున్న ఒకే ఒక్క మాట క‌రోనా. చిన్న పిల్లాడి నుండి పండు ముస‌లి వ‌ర‌కు కొద్ది రోజులుగా ఇదే పేరుని జ‌పం చేస్తూ కాలం గడుపుతున్నారు. కొద్ది ద‌శాబ్ధాల పాటు గుర్తుండేలా ఈ క‌రోనా విల‌యతాండ‌వం సాగుతుంది. అయితే ప్ర‌పంచం మొత్తం ఈ క‌రోనా వైర‌స్‌కి భ‌య‌ప‌డి బిక్కుబిక్కుమంటూ కాలం గడుపుతుంటే ఓ జంట‌కి మాత్రం క‌రోనా గురించి ఏ మాత్రం తెలియ‌దంట‌.

వివ‌రాల‌లోకి వెళితే యూకేలోని మాంచెస్ట‌ర్‌కి చెందిర ఎలెనా మ‌ణిశెట్టి, ర్యాన్ ఒస్బోర్న్ 2017లో త‌మ ఉద్యోగాల‌కి రిజైన్ చేసి బోట్‌ని కొనుగోలు చేశారు. ఇందులో ప్ర‌పంచ వ్యాప్తంగా ప్ర‌యాణిస్తూ ఇంట్లో వాళ్ల‌తో అప్పుడ‌ప్పుడు ట‌చ్‌లో ఉంటున్నారు. అయితే బ్యాడ్ న్యూస్ ఏవి త‌మ‌కి చెప్ప‌కూడ‌ద‌నే నిబంధన కూడా పెట్టార‌ట‌. ఈ నేప‌థ్యంలో క‌రోనా మ‌హ‌మ్మారి గురించి వారికేం తెలియ‌లేదట‌.

ఈ జంట గత నెలలో కానరీ దీవుల నుండి కరేబియన్ వరకు అట్లాంటిక్ మహాసముద్రం మీదుగా ప్రయాణిస్తున్నప్పుడు, క‌రోనా వ్యాధి ప్రపంచవ్యాప్తంగా వ్యాపించింది. దీంతో అనేక దేశాలు త‌మ‌ స‌రిహ‌ద్దుల‌ని మూసివేశాయి. ఈ నేప‌థ్యంలో వేలాది ప్ర‌యాణికుల‌తో కూడిన‌ క్రూయిజ్ షిప్  కూడిన స‌ముద్రంలోనే చిక్కుకుపోయింది. అయితే క‌రేబీయ‌న్ దీవుల‌కి చేరుకున్న ఈ జంట దాని స‌రిహ‌ద్దు మూసి ఉంద‌ని తెలిసి షాక‌య్యార‌ట.

కరేబియన్ ద్వీపం సరిహ‌ద్దులు మూసి ఉన్నాయ‌ని తెలుసుకున్న వీరిద్ద‌రు  తమ నౌకను గ్రెనడాకు మళ్లించారు, అక్కడ వారు చివరకు ఇంటర్నెట్ కనెక్షన్ పొందగలిగారు . దాంతో  ప్రపంచవ్యాప్తంగా ఏమి జరుగుతుందో గ్రహించారు. వెంట‌నే సెయింట్ విన్సెంట్‌లో ఉన్న స్నేహితుడికి ఫోన్ చేసిన ఈ జంట ఆతిధ్యం కోసం ప్ర‌య‌త్నించారు.ఇటలీలో ప్ర‌స్తుత ప‌రిస్థితుల కార‌ణంగా త‌ల‌దాచుకునే అవ‌కాశం లేద‌ని వారి ఫ్రెండ్స్ చెప్పిన‌ట్టు బీబీసీకి తెలిపారు 

ప్ర‌స్తుతం సెయింట్ విన్సెంట్ ప్రాంతంలో ఉన్న వీరు 25 రోజుల పాటు స‌ముద్రంలోనే ఐసోలేష‌న్‌లో ఉండ‌నున్నారు. జూన్ లో హరికేన్ సీజన్ ప్రారంభం కానుండ‌గా, అంత క‌న్నా ముందే త‌మ‌ని అధికారులు అనుమ‌తిస్తార‌ని ఆశిస్తున్నాం అని ఎలెనా చెప్పింది .


logo