గురువారం 04 జూన్ 2020
International - May 19, 2020 , 18:22:44

కరోనా పుట్టుకపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు

కరోనా పుట్టుకపై స్వతంత్ర సంస్థతో దర్యాప్తు

జెనీవా: కరోనా వైరస్‌ను మీరే పుట్టించారని చైనాపై అమెరికా అపవాదు వేస్తే.. ఎలాంటి ఆధారాలు లేకుండా తమను దోషిగా నిలుపొద్దని చైనా వాదిస్తున్నది. వీరిద్దరు ఒకరిపై ఒకరు కత్తులు దూసుకొంటున్న ప్రస్తుత తరుణంలో పెద్దన్నగా వ్యవహరిస్తున్న ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌వో) మెజారిటీ దేశాల నుంచి వస్తున్న ఒత్తిళ్ల నేపథ్యంలో దర్యాప్తు చేపట్టేందుకు నిర్ణయించింది. ఏదైనా స్వతంత్ర సంస్థతో కరోనా వైరస్‌ పుట్టక, వ్యాప్తికి చెందిన అంశాలపై విచారణ చేపట్టి అందరి అనుమానాలను నివృత్తి చేయాలని కార్యాచరణ సిద్ధం చేసింది. 

డబ్ల్యూహెచ్‌వో అనుబంధ సంస్థ అయిన వరల్డ్‌ హెల్త్‌ అసెంబ్లీ 73 వ వార్షిక సమావేశాల్లో కరోనా వైరస్‌పై తీవ్రంగా చర్చించిన ప్రపంచ దేశాలు.. ఈ వైరస్‌ పుట్టుకకు సంబంధించి దర్యాప్తు చేపట్టాలని కూడా డిమాండ్‌ చేశాయి. యురోపియన్‌ యూనియన్‌ తీర్మానం చేసిన తర్వాత వీడియో కాన్ఫరెన్స్‌ ద్వారా మాట్లాడిన జిన్‌పింగ్‌.. కరోనా వైరస్‌ పుట్టుక, వ్యాప్తిపై దర్యాప్తు జరిపేందుకు తమకెలాంటి అభ్యంతరం లేదని, అయితే, ప్రపంచ దేశాలు ఈ వైరస్‌పై పట్టుసాధించిన తర్వాత విచారణ చేపడదామని సూచించారు. ఈ నేపథ్యంలో స్వతంత్ర సంస్థతో విచారణ చేపట్టి నిజాలు నిగ్గు తేల్చేందుకు డబ్ల్యూహెచ్‌వో సిద్ధమైంది. ఇలా ఉండగా, కరోనా వైరస్‌ కారణంగా ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 3 లక్షలకు పైగా జనం చనిపోయారు. 


logo