బుధవారం 25 నవంబర్ 2020
International - Nov 04, 2020 , 06:47:48

అమెరికాలో కొన‌సాగుతున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

అమెరికాలో కొన‌సాగుతున్న అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓట్ల లెక్కింపు

వాషింగ్ట‌న్‌: అమెరికాలో అధ్య‌క్ష ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ కొన‌సాగుతున్న‌ది. దేశంలోని తూర్పు రాష్ట్రాల్లో ఇప్ప‌టికే ఎన్నిక‌లు ముగియ‌గా, ద‌క్షిణాది రాష్ట్రాల్లో ఓటింగ్‌ కొన‌సాగుతున్న‌ది. అమెరికా అధ్య‌క్ష ఎన్నిక‌ల్లో గ‌త వందేండ్ల‌లో ఎప్పుడూ లేనంత‌గా అత్య‌ధిక ఓటింగ్ న‌మోద‌వుతున్న‌ది. అధ్య‌క్ష అభ్య‌ర్థులు డొనాల్డ్ ట్రంప్‌, జో బైడెన్ ఎవ‌రికి వారు త‌మ విజ‌యంపై  ధీమాగా ఉన్నారు. దేశంలో మొత్తం 50 రాష్ట్రాల్లో 538 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. ఇందులో 270 ఎల‌క్టోర‌ల్ ఓట్లు గెలుచుకున్నవారు అధ్య‌క్షప‌ద‌విని సొంతం చేసుకోనున్నారు. ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్న రాష్ట్రాల‌దే కీల‌క పాత్ర వ‌హించ‌నున్నాయి. కాలిఫోర్నియాలో అత్య‌ధికంగా 55 ఓట్లు ఉండ‌గా, టెక్నాస్‌లో 38, న్యూయార్క్‌లో 29, ఫ్లోరిడాలో 29, పెన్సిల్వేనియాలో 20, ఇల్లినాయిస్‌లో 20 ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉండ‌గా, 30 రాష్ట్రాల్లో 10 కంటే త‌క్కువ ఎల‌క్టోర‌ల్ ఓట్లు ఉన్నాయి. ఎక్కువ ఓట్లు వ‌చ్చిన‌వారికే ఆ రాష్ట్రంలోని మొత్తం ఎల‌క్టోర‌ల్ ఓట్లు ద‌క్క‌నున్నాయి.  

నిన్న అమెరికాలో అధ్యక్ష ఎన్నిక‌ల ఓటింగ్ ప్ర‌క్రియ ముగిసింది. భార‌త కాల‌మానం ప్ర‌కారం క‌నెక్టిక‌ట్‌, కెంట‌కీ, మెయిన్‌, న్యూజెర్సీ, న్యూయార్క్‌, వ‌ర్జీనియా రాష్ట్రాల్లో మంగ‌ళ‌వారం సాయంత్రం 4.30 గంట‌ల‌కు పోలిగ్ ప్రారంభ‌మ‌య్యింది. న్యూహాంప్‌షైర్‌లోని రెండు చిన్న ప‌ట్ట‌ణాల్లో తొలుత ఎన్నిక‌లు పూర్త‌య్యాయి. దీంతో అక్క‌డ అధికారులు కౌంటింగ్ కూడా పూర్తిచేశారు. దేశంలో మొత్తంగా 23.9 కోట్ల మంది అర్హులైన ఓట్ల‌రు ఉండ‌గా.. ఇప్ప‌టికే దాదాపు 10 కోట్ల‌మంది అమెరిక‌న్లు ముంద‌స్తు ఓటు వేశారు.