గురువారం 04 జూన్ 2020
International - Apr 25, 2020 , 12:19:26

విధినిర్వహణలో ఉన్న మరో అమెరికా యుద్ధనౌకలో కరోనా విస్తరణ

విధినిర్వహణలో ఉన్న మరో అమెరికా యుద్ధనౌకలో కరోనా విస్తరణ

హైదరాబాద్: సముద్రజలాల్లో విధి నిర్వహణలో ఉన్న మరో అమెరికా యుద్ధనౌకలో కరోనా ప్రజ్వరపిల్లింది. నౌకాదళానికి చెందిన డిస్ట్రాయర్ 'యూఎస్ఎస్ కిడ్'లో కరోనా విస్తరించడంతో ఆ నౌకను రేవుకు తరలిస్తున్నట్టు అధికారులు తెలిపారు. కనీసం 18 మందికి కరోనా సోకింది. ఈ సంఖ్య మరింత పెరగవచ్చని అధికారులు భావిస్తున్నారు. నౌకపై కరోనా ఏమేరకువిస్తరించిందీ అంచనా వేస్తున్నారు. ప్రస్తుతం 'యూఎస్ఎస్ కిడ్' మధ్య అమెరికా తీరంలో మాదక ద్రవ్యాల రవాణాను అరికట్టే విధులు నిర్వహిస్తున్నది. నౌకలో మొత్తం 350 మంది సిబ్బంది ఉన్నారు. ప్రపంచవ్యాప్తంగా డ్యూటీలో ఉన్న అమెరికా నౌకాదళంలో కరోనా కారణంగా రేవుకు రప్పిస్తున్న రెండో యుద్ధనౌక ఇది. ప్రపంచవ్యాప్తంగా మొత్తం 90 నౌకలు విధులు నిర్వహిస్తున్నాయి. యూఎస్ఎస్ థియోడోర్ రూజ్‌వెల్ట్ యుద్ధనౌక ఇటీవలే కరోనా కారణంగా రేవుకు తరలించిన సంగతి తెలిసిందే. 'యూఎస్ఎస్ కిడ్'లో ఓ నావికునికి జబ్బు చేయడంతో శాన్ అంటోనియోకు తరలించి పరీక్షలు జరిపారు. అతడికి కరోనా పాజిటివ్ రావడంతో నౌక మీదకు ప్రత్యేక వైద్య బృందాన్ని పంపారు. అతనితో ఎవరెవరు గడిపిందీ తెలుసుకుని పరీక్షలు జరుపుతున్నారు. 


logo