బుధవారం 03 జూన్ 2020
International - Apr 27, 2020 , 19:27:44

అమెరికాలో 10 లక్షలకు చేరువగా కరోనా కేసులు

అమెరికాలో 10 లక్షలకు చేరువగా కరోనా కేసులు

లండన్: ప్రపంచవ్యాప్తంగా కరోనా మహమ్మారి విజృంభణ కొనసాగుతోంది. ప్రపంచవ్యాప్తంగా సోమవారం వరకు 3,012,224 మందికి వైరస్‌ సోకగా..వ్యాధి వల్ల 207,860 మంది మరణించారు. అగ్రరాజ్యం అమెరికాలోనే కరోనా కేసులు, మరణాలు ఎక్కువగా నమోదవుతున్నాయి. అమెరికాలో వైరస్‌ బాధితుల సంఖ్య 10లక్షలకు చేరువైంది. మృతుల సంఖ్య 55వేలు దాటింది. 

రష్యాలో కొత్తగా  6,198 మందికి కరోనా పాజిటివ్‌గా  నిర్ధారణ అయింది.   దీంతో దేశవ్యాప్తంగా కరోనా సోకిన వారి సంఖ్య 87,147కు పెరిగింది. గడచిన 24 గంటల్లో మరో 50 మంది కరోనా వల్ల చనిపోయారని రష్యా అధికారులు తెలిపారు.  అతిపెద్ద దేశం రష్యా కోవిడ్‌-19 కేసుల సంఖ్య కరోనా మహమ్మారి పుట్టుకకు కేంద్ర స్థానంగా భావిస్తున్న చైనా( కరోనా కేసుల సంఖ్య 82,830)ను కూడా దాటేసింది. 

అత్యధిక కరోనా కేసులు నమోదైన దేశాలు ఇవే..

అమెరికా (939,249)

స్పెయిన్‌(223,759)

ఇటలీ(195,351)

ఫ్రాన్స్‌(161,665)

జర్మనీ (156,513)


logo