గురువారం 28 మే 2020
International - Apr 24, 2020 , 06:56:58

వన్యప్రాణుల నుంచే కరోనా వ్యాప్తి!

వన్యప్రాణుల నుంచే కరోనా వ్యాప్తి!

లాస్‌ఏంజెల్స్‌: అడవుల్లో ఉండే వన్యప్రాణుల నుంచి కొవిడ్‌-19 మనుషులకు సంక్రమించిందని అమెరికాలోని సౌతర్న్‌ కాలిఫోర్నియా యూనివర్సిటీకి చెందిన పరిశోధకులు అంచనా వేస్తున్నారు. వైరస్‌ వెలుగుచూసిన చైనాలోని వుహాన్‌ మార్కెట్లలో చేపలతో పాటు బతికున్న జంతువుల్ని (వన్య ప్రాణుల్ని) కూడా విక్రయించేవారని అన్నారు. హార్స్‌ష్యూ వర్గానికి చెందిన గబ్బిలాల ద్వారా కొవిడ్‌-19 జంతువులకు సంక్రమించిందని, వాటి ద్వారా మనుషులకు సోకి ప్రపంచమంతా వ్యాపించినట్టు భావిస్తున్నామని పేర్కొన్నారు. 


logo