గురువారం 28 మే 2020
International - May 04, 2020 , 08:34:50

212 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌..

212 దేశాలకు విస్తరించిన కరోనా వైరస్‌..

 పారిస్‌: ప్రాణాంతక కరోనా వైరస్‌ 212 దేశాలకు విస్తరించింది. ఈ వైరస్‌ ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 35,66,004 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఈ వైరస్‌ మృతిచెందినవారి సంఖ్య 2,48,282కు చేరింది. 21,63,708 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 11,54,014 మంది బాధితులు కోలుకుని డిశ్చార్జి అయ్యారు. అగ్రరాజ్యం అమెరికాలో నిన్న ఒక్కరోజే 1,154 మంది మృతి చెందారు. దీంతో దేశంలో ఈ వైరస్‌ ప్రభావంతో 68,598 మంది మరణించారు. అమెరికాలో మొత్తంగా 11,88,122 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇందులో 9,41,261 కేసులు యాక్టివ్‌గా ఉండగా, 1,1,54,014 మంది కోలుకున్నారు. 

అమెరికా తర్వాత కరోనాతో అత్యంత ప్రభావితమైన స్పెయిన్‌లో 2,47,122 కరోనా కేసులు నమోదవగా, 25,264 మంది మరణించారు. యురోపియన్‌ దేశమైన ఇటలీలో 2,10,717 కరోనా కేసులు నమోదవగా, 28,884 మంది మృతిచెందారు. యూకేలో 1,86,599 కరోనా పాజిటివ్‌లు నమోదవగా, 28,446 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో 1,68,693 మది ఈ ప్రాణాంతక వైరస్‌ బారిన పడగా, 24,895 మంది బాధితులు మృతిచెందారు. 

తాజాగా అత్యధిక కేసులు నమోదవుతున్న రష్యాలో మొత్తం కరోనా కేసుల సంఖ్య 1,34,687కు చేరింది. దేశంలో ఇప్పటివరకు 1,280 మంది మరణించారు. నిన్న ఒక్కరోజే దేశంలో 10633 కరోనా కేసులు నమోదయ్యాయి.


logo