ఆదివారం 31 మే 2020
International - May 21, 2020 , 12:06:42

దేవుడి సందేశం.. కరోనా వడగండ్లు..

దేవుడి సందేశం.. కరోనా వడగండ్లు..

లాక్‌డౌన్‌లో ఇంట్లోనే ఉండమని పోలీసులు, అధికారులు, వైద్యులు ఎంతమంది హెచ్చరించినా ప్రజలు వినకపోవడంతో  ఆ వానదేవుడే హెచ్చరికగా కరోనా వడగండ్లు కురిపించాడు. ఇప్పుడు కూడా నిర్లక్ష్యం వహిస్తే ఇక కాటికే అన్నట్లు ఉన్నాయి ఈ ఐస్‌ క్యూబ్స్‌.  ఈ సంఘటన మెక్సికోలోని మోంటేమోరేలోస్‌ మున్సిపాలిటీలో చోటుచేసుకున్నది. భారీ వర్షంతోపాటు వడగండ్లు పడ్డాయి. ఇవి కరోనా ఆకారంలో ఉన్నాయి. వీటిని చూసిన వారందరూ దేవుడే సందేశం పంపినట్లు భావిస్తున్నారు. వడగండ్లను ఫొటోలు తీసి యూజర్‌ ప్రమిత్‌ కుమార్‌ ట్విటర్‌లో షేర్‌ చేశాడు. ఈ ఫొటోలు నెట్టింట్లో వైరల్‌గా మారాయి. వర్షం పడేటప్పుడు ఎప్పుడు వడగండ్లు పడినా అవి వివిధ రకాలుగా ఉంటాయి. ప్రస్తుతం కరోనా టాపిక్‌ నడుస్తుంది కాబట్టి ఏది జరిగినా కరోనాకు ముడిపెడుతున్నారు. బలమైన గాలులు, ఒత్తిడి వల్ల మంచు ముద్దలు ఒకదానికొకటి ఢీకొని భిన్నా ఆకారాల్లోకి మారి కిందపడతాయి. మెక్సికోలో పడిన వడగండ్లు కూడా ఇలాంటివే అని వాతావరణ అధికారులు పేర్కొన్నారు. 
logo