శుక్రవారం 29 మే 2020
International - Mar 28, 2020 , 18:04:17

క‌రోనా త‌గ్గింద‌ని పార్టీ.. మ‌ళ్లీ అంటుకున్న మ‌హ‌మ్మారి

క‌రోనా త‌గ్గింద‌ని పార్టీ.. మ‌ళ్లీ అంటుకున్న మ‌హ‌మ్మారి

న్యూఢిల్లీ: క‌రోనా మ‌హ‌మ్మారి ప్రపంచంలోని పలు దేశాలను ఉక్కిరిబిక్కిరి చేస్తున్నా కొంద‌రు మాత్రం లైట్ తీసుకుంటున్నారు. కొంద‌రైతే ఒక‌సారి వైర‌స్ బారిన‌ప‌డి బ‌తుకుజీవుడా అంటూ బ‌య‌ట‌ప‌డి కూడా నిర్ల‌క్ష్యంగా వ్య‌వ‌హ‌రిస్తున్నారు. ఇలాంటి ఘ‌ట‌నే ఇప్పుడు పాకిస్థాన్‌లో చోటు చేసుకుంది.  ఒక‌సారి క‌రోన‌బారిన ప‌డి బ‌య‌ట‌ప‌డ్డ వ్య‌క్తి  ఆజాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించి స్నేహితుల‌కు పార్టీ ఇచ్చాడు. దీంతో ఆ మ‌హ‌మ్మారి మ‌ళ్లీ ఎటాక్ అయ్యింది. 

పాకిస్థాన్‌లోని రావల్పిండికి చెందిన ఒక వ్యక్తికి రెండు వారాల క్రితం కరోనా సోకింది. వైద్యులు అతన్ని క్వారంటైన్లో ఉంచి చికిత్స అందించారు. రెండు వారాలు ముగియ‌డంతో ఇటీవ‌ల మ‌రోసారి వైద్య‌ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. ఈ ప‌రీక్ష‌ల్లో క‌రోనా నెగెటివ్‌గా తేల‌డంతో అతడిని ఇంటికి పంపించారు. అయితే అత‌ను కొన్నాళ్లు జాగ్ర‌త్త‌గా ఉండాల్సింది పోయి.. దాదాపు 100 మంది బంధువులు, మిత్రుల‌ను ఆహ్వానించి పార్టీ ఇచ్చాడు. ఆయితే ఆ పార్టీకి వచ్చినవారిలో ఒకరికి కరోనా ఉండటంతో పార్టీ ఇచ్చిన వ్యక్తికి కూడా మ‌రోసారి మ‌హ‌మ్మారి సోకింది. దీంతో ఆ ఇద్ద‌రిని క్వారెంటైన్ సెంట‌ర్లో ఉంచి చికిత్స అందిస్తున్నారు. 


logo