బుధవారం 01 ఏప్రిల్ 2020
International - Mar 07, 2020 , 21:47:41

చైనాలో కూలిన క్వారంటైన్‌ హోటల్‌

చైనాలో కూలిన క్వారంటైన్‌ హోటల్‌

షాంఘై : చైనాలో భారీ ప్రమాదం సంభవించింది. కరోనా బాధితుల కోసం ఏర్పాటుచేసిన క్వారంటైన్‌ హోటల్‌ కుప్పకూలడంతో 70 మంది అందులో చిక్కుకుపోయారు. ఫుజియాన్‌ ప్రావిన్స్‌లోని క్వాంజౌ నగరంలో  రాత్రి 7.30 గంటల సమయంలో ఈ ప్రమాదం జరిగింది. ఇప్పటివరకు 34 మందిని రక్షించినట్లు అధికారులు తెలిపారు. 2018 జూన్‌లో ప్రారంభమైన ఈ హోటల్‌లో 80 గదులు ఉన్నాయి. కరోనా విజృంభణ నేపథ్యంలో దీన్ని వైరస్‌ బాధితుల కోసం వినియోగిస్తున్నారు. శుక్రవారం నాటికి ఫుజియాన్‌ ప్రావిన్సులో 296 మంది వైరస్‌ బారిన పడగా, 10,819 మందిని కరోనా అనుమానంతో అబ్జర్వేషన్‌లో ఉంచారు. భవనం కూలిపోవడానికి గల కారణాలు ఇంకా తెలియరాలేదు. ఘటనా స్థలానికి చైనా క్యాబినెట్‌ ఎమర్జెన్సీ వర్కింగ్‌ టీమ్‌ను పంపింది. logo
>>>>>>