శుక్రవారం 10 ఏప్రిల్ 2020
International - Mar 25, 2020 , 16:38:51

ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌

ప్రిన్స్‌ చార్లెస్‌కు కరోనా పాజిటివ్‌

యూకే : ప్రిన్స్‌ చార్లెస్‌(71)కు కరోనా వైరస్‌ పాజిటివ్‌గా నిర్ధారణం అయింది. కాగా ఆయన ఆరోగ్య పరిస్థితి ప్రస్తుతం నిలకడగా ఉన్నట్లు అధికారిక ప్రతినిధి తెలిపారు. బల్మోరల్లో చార్లెస్‌, కెమిల్లా ఇరువురు స్వీయ ఐసోలేషన్‌లో ఉన్నారన్నారు. గత కొన్ని రోజులుగా ప్రిన్స్‌ ఇంటి వద్ద నుండే అన్ని పనులను చూస్తున్నారు. ప్రజా పనుల్లో భాగంగా ప్రిన్స్‌ చార్లెస్‌ గత కొన్ని వారాలుగా ఎంతో మందిని కలిశారన్నారు. కావునా వీరిలో ఎవరి నుంచి ప్రిన్స్‌కు కరోనా సోకిందో చెప్పలేమన్నారు. కోవిడ్‌-19 వ్యాధితో వేల్స్‌లో ఇప్పటి వరకు 17 మంది చనిపోయారు. 478 మందికి కరోనా పాజిటివ్‌గా తేలింది.


logo