శనివారం 06 జూన్ 2020
International - Apr 15, 2020 , 20:27:42

జర్మనీలో మూడు వేలు దాటిన కరోనా మరణాలు

జర్మనీలో మూడు వేలు దాటిన కరోనా  మరణాలు

న్యూఢిల్లీ:  జర్మనీలో ఇప్పటి వరకూ కరోనా వైరస్(కోవిడ్‌-19) సోకి మరణించిన వారి సంఖ్య మూడు వేలు దాటింది.  గడచిన 24 గంటల్లో జర్మనీలో కరోనా వైరస్ కారణంగా 300 మందికి పైగా మరణించారు. దీంతో మొత్తం మరణాల సంఖ్య 3,528కు పెరిగింది. బుధవారం వరకు ఆ  దేశంలో 132,553 మందికి కరోనా సంక్రమించింది. బాధితులకు మెరుగైన వైద్యం అందించడంతో చాలా మంది కోలుకున్నారు. 

ప్రపంచవ్యాప్తంగా అత్యధికంగా అమెరికా(615,406 పాజిటివ్‌ కేసులు), స్పెయిన్‌(177,633),  ఇటలీ(162,488), ఫ్రాన్స్‌(143,303), జర్మనీ(132,553) దేశాల్లో లక్షకు పైగా కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.  

మరోవైపు  కరోనా మరణాల్లోనూ అగ్రరాజ్య అమెరికానే 26,164 మృతుల సంఖ్యతో మొదటి స్థానంలో ఉంది. ఇప్పటి వరకు స్పెయిన్‌(18,579 మృతులు), ఇటలీ(21,067), ఫ్రాన్స్‌(15,729), జర్మనీ(3,528) దేశాల్లో   కరోనా మహమ్మారి కారణంగా భారీగా మరణాలు సంభవించాయి. logo