శుక్రవారం 05 జూన్ 2020
International - May 06, 2020 , 10:42:21

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి

ప్రపంచాన్ని కబళిస్తున్న కరోనా మహమ్మారి

న్యూయార్క్‌: కరోనా మహమ్మారి ప్రపంచ దేశాలను కబళిస్తున్నది. ఈ మహమ్మారి ప్రభావంతో ప్రపంచవ్యాప్తంగా ఇప్పటివరకు 37,27,894 పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. కరోనా బారిన పబడిన 2,58,342 మంది మరణించగా, 12,42,407 లక్షల మంది కోలుకున్నారు. మరో 22,27,145 కరోనా కేసులు యాక్టివ్‌గా ఉన్నాయి. అగ్రరాజ్యం అమెరికాలో ప్రణాంతక వైరస్‌ వల్ల గత 24 గంటల్లో 2333 మంది మరణించారు. మొత్తంగా దేశంలో కరోనా మృతుల సంఖ్య 72,271కి చేరింది. అమెరికాలో ఇప్పటివరకు 12,37,633 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి.

అత్యధిక కరోనా పాజిటివ్‌ కేసులు నమోదవుతున్న దేశాల్లో రెండో స్థానంలో ఉన్న స్పెయిన్‌లో కేసుల సంఖ్య 2,50,561కి చేరింది. దేశంలో ఇప్పటివరకు 25,613 మంది బాధితులు మరణించారు. ఇటలీలో 2,13,013 కేసులు నమోదవగా, 29,315 మంది మృతిచెందారు. అదేవిధంగా మరో యూరోపియన్‌ దేశమైన యూకేలో 1,94,990 కరోనా పాజిటివ్‌ కేసులు నమోదయ్యాయి. ఇక్కడ ఈ వైరస్‌ బారిన పడిన 29,427 మంది మరణించారు. ఫ్రాన్స్‌లో కరోనా కేసుల సంఖ్య 1,70,551కి చేరింది. మొత్తం 25,531 మంది మృతిచెందారు. జర్మనీలో ఇప్పటివరకు 1,67,007 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 6,993 మంది మరణించారు. రష్యాలో కరోనా కేసుల సంఖ్య వేగంగా పెరుగుతున్నది. దేశంలో ఇప్పటివరకు 1,55,370 పాజిటివ్‌ కేసులు నమోదవగా, 1451 మంది మరణించారు. 


logo