శనివారం 06 జూన్ 2020
International - May 14, 2020 , 11:28:51

క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా ఉంటుంది: డ‌బ్ల్యూహెచ్‌వో

క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా ఉంటుంది: డ‌బ్ల్యూహెచ్‌వో


హైద‌రాబాద్‌: నోవెల్ క‌రోనా వైర‌స్ ఎక్క‌డికీ వెళ్ల‌దు అని, దానితో క‌లిసి జీవించ‌డం మ‌నుషులు నేర్చుకోవాల‌ని ప్ర‌పంచ ఆరోగ్య సంస్థ హెచ్చ‌రించింది. ప్ర‌పంచ వ్యాప్తంగా కొన్ని దేశాలు స్వ‌ల్పంగా లాక్‌డౌన్ ఎత్తివేస్తున్న నేప‌థ్యంలో డ‌బ్ల్యూహెచ్‌వో ఈ విధంగా రియాక్ట్ అయ్యింది.  బ‌హుశా క‌రోనా వైర‌స్ శాశ్వ‌తంగా అంతం కాదు అన్న సంకేతాన్ని డ‌బ్ల్యూహెచ్‌వో వినిపించింది.  ప్ర‌పంచ జ‌నాభాలోకి కొత్త‌గా వైర‌స్ ప్ర‌వేశించింద‌ని, అయితే ఎప్పుడు ఆ వైర‌స్‌ను జ‌యిస్తామ‌న్న విష‌యాన్ని ఇప్పుడే అంచ‌నా వేయ‌లేమ‌ని డ‌బ్ల్యూహెచ్‌వో ఎమ‌ర్జెన్సీ డైర‌క్ట‌ర్ మైఖేల్ ర్యాన్ తెలిపారు.   ఈ వైర‌స్ మ‌న జీవితాల్లో భాగ‌స్వామ్యం అవుతుంద‌ని, ఇక వైర‌స్ ఇప్ప‌ట్లో వెళ్లే సూచ‌న‌లు క‌నిపించ‌డం లేద‌ని ఆయ‌న అన్నారు. జెనీవాలో మీడియాతో మాట్లాడిన ర్యాన్‌.. హెచ్ఐవీ ఇంకా వెళ్లిపోలేద‌ని, కానీ ఆ వైర‌స్‌తో జీవించ‌డం నేర్చుకున్నామ‌న్నారు.  క‌రోనా వైర‌స్‌తో ఏర్ప‌డిన లాక్‌డౌన్ వ‌ల్ల సుమారు స‌గం ప్ర‌పంచ జ‌నాభా ఇబ్బందులు ఎదుర్కొంటున్న విష‌యం తెలిసిందే. లాక్‌డౌన్ ఆంక్ష‌ల‌ను ఎత్తివేస్తున్న దేశాల‌న్నీ జాగ్ర‌త్త‌గా వ్య‌వ‌హ‌రించాల‌ని డ‌బ్ల్యూహెచ్‌వో చీఫ్ టెడ్రోస్ తెలిపారు.    


logo