గురువారం 04 జూన్ 2020
International - Apr 20, 2020 , 16:29:33

మ‌నుషుల‌ను వెతుకుతున్న పెంగ్విన్లు!

మ‌నుషుల‌ను వెతుకుతున్న పెంగ్విన్లు!

సాధారణగా పక్షులను, అడవి జంతువులను చూడ్డానికి మనుషులు జూకు వెళ్తారు. ఇప్పుడు మనుషులను చూడ్డానికి ఇంటివద్దకే పక్షులు జంతువులు వస్తున్నాయి. లాక్‌డౌన్ కార‌ణంగా బయట మనుషుల అలికిడి తగ్గింది.  ఇప్పుడు ఇంటికే ప‌రిమితమైన మ‌నుషుల‌ను చూడ‌డానికి పెంగ్విన్లు రోడ్డు పైకి వ‌స్తున్నాయి. కేప్‌టౌన్ న‌గ‌రంలో ఖాళీగా ఉన్న వీధుల్లో పెంగ్విన్లు  స్వేచ్ఛగా తిరుగుతున్నాయి. ఈ వీడియో నెట్టింట్లో వైరల్ అయ్యింది. 

ఈ వీడియోను ఇండియ‌న్ ఫారెస్ట్ స‌ర్వీస్ (ఐఎఫ్ఎస్‌) అధికారి సుశాంత నందా ట్విట‌ర్‌లో పోస్ట్ చేశాడు. పెంగ్విన్స్ ఆక్లాండ్ వీధులను తనిఖీ చేస్తున్నాయి. 'ప‌క్షులు మాన‌వుల‌ను వెతుకుతున్నాయి' అనే క్యాప్ష‌న్‌తో ఆయన ఈ వీడియోను పోస్ట్ చేశాడు. 27 సెకండ్ల‌ వీడియోలో మూడు పెంగ్విన్‌లు సాధారణంగా వీధులను దాటుతున్న‌ట్లు చూడ‌వ‌చ్చు.  ఇంత‌కుమునుపు పెంగ్విన్ల‌ను బ‌హిరంగంగా మ‌నం ఎప్పుడూ చూడ‌లేదు. క్లిప్ ఆన్‌లైన్‌లో షేర్ చేసిన వెంట‌నే వైర‌ల్ అయింది. 1.4 కే మంది వీక్షించారు. ట్విట‌ర్‌లో చాలామంది కామెంట్లు పెడుతున్నారు. 



logo