శుక్రవారం 25 సెప్టెంబర్ 2020
International - Aug 23, 2020 , 18:44:49

స్పానిష్‌ ఫ్లూకంటే వేగంగా కరోనా అదృశ్యమవుతుంది: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌

స్పానిష్‌ ఫ్లూకంటే వేగంగా కరోనా అదృశ్యమవుతుంది: డబ్ల్యూహెచ్‌ఓ చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌

జెనీవా: 1918లో వచ్చిన స్పానిష్‌ ఫ్లూకంటే కరోనా వైరస్‌ వేగంగా అదృశ్యమయ్యే అవకాశముందని ప్రపంచ ఆరోగ్య సంస్థ (డబ్ల్యూహెచ్‌ఓ) చీఫ్‌ టెడ్రోస్‌ అధనామ్‌ అభిప్రాయపడ్డారు. జెనీవాలోని డబ్ల్యూహెచ్‌వో ప్రధాన కార్యాలయం నుంచి ఆయన విలేకరులతో మాట్లాడారు. మన దగ్గరున్న అత్యాధునిక సాంకేతిక పరిజ్ఞానంతో కరోనాను పూర్తిగా కట్టడి చేయవచ్చని ఆయన పేర్కొన్నారు. స్పానిష్‌ ఫ్లూ వచ్చిన కాలంతో పోలిస్తే ఇప్పుడు ప్రపంచీకరణ, దేశాల మధ్య సాన్నిహిత్యం, అనుసంధానత పెరిగినందువల్ల కరోనా చాలా వేగంగా ప్రపంచాన్ని చుట్టేసిందన్నారు. అయితే, అందుబాటులో ఉన్న సాధనాలను (టీకాలు) ఉపయోగించుకుని స్పానిష్‌ ఫ్లూకంటే వేగంగా కరోనాను ఈ భూగ్రహం నుంచి పారదోలుతామని ఆయన ధీమా వ్యక్తంచేశారు. 

కొవిడ్‌ ఇప్పటివరకూ ప్రపంచవ్యాప్తంగా ఎనిమిది లక్షల మందిని పొట్టనబెట్టుకుంది. 23 మిలియన్ల మందికి సోకింది. స్పానిష్‌ ఫ్లూ ఫిబ్రవరి 1918, ఏప్రిల్ 2020 మధ్యకాలంలో విజృంభించింది. 50 మిలియన్ల మందిని చంపింది. ప్రపంచవ్యాప్తంగా 500 మిలియన్ల మందికి సోకింది. ఇదిలా ఉండగా, కరోనా వైరస్‌ ఈ ప్రపంచంనుంచి దూరం కావడానికి రెండేళ్లు పడుతుందని డబ్ల్యూహెచ్‌వో చీఫ్‌ టెడ్రెస్‌ అధనామ్‌ గత సమావేశంలో పేర్కొన్నారు.

లోకల్ టు గ్లోబల్.. వార్త ఏదైనా.. అన్నీ ఒకే యాప్లో. నమస్తే తెలంగాణ ఆండ్రాయిడ్ యాప్ డౌన్లోడ్ చేసుకోండి.


logo